దీపావళికి ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దీపావళి పండగల సమయంలో ఏర్పడే రద్దీని ఎదుర్కొనడానికి సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లనూ పొడిగిస్తూ వస్తోన్నారు.

- తాజాగా చెన్నై ఎగ్మూర్ నుంచి పశ్చిమ బెంగాల్ లోని సంత్రాగచ్చికి రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ నెల 19న (ఆదివారం) మధ్యాహ్నం 2:15 నిమిషాలకు చెన్నై ఎగ్మూర్ నుంచి బయలుదేరే నంబర్ 06109 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది.
- ఈ నెల 20న (సోమవారం) మధ్యాహ్నం 2:55 నిమిషాలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరే నంబర్ 06110 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 9 గంటలకు చెన్నై ఎగ్మూర్ కు చేరుకుంటుంది.
- సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్ పూర్ మీదుగా ఈ ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications