క్యాబ్ డ్రైవర్ స్పీడ్, పోలీసుల మృతి: ట్యాంకర్ పేలి 10 మంది దుర్మరణం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు పోలీసు బారికేడ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు సబ్ ఇన్స్‌పెక్టర్, మరొకరు కానిస్టేబుల్.

ఈ ప్రమాదంలో మరో కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ పికెట్ చెకింగ్ వద్ద వేగంగా వెళ్తున్న అతను ఇద్దరిని బలిగొన్నాడు. కారును ఆపాల్సిందిగా పోలీసులు డ్రైవర్‌కు సంకేతాలు ఇచ్చారు.

అయితే, అతను వేగంగా వెళ్తున్న ఆ కారును ఆపకుండా బారికేడ్ల వైపుకు పోనిచ్చి, వాటిని ఢీకొట్టాడు. పోలీసులను గుద్దిన కారు.. వారిని దాదాపు వంద మీటర్ల దూరం వైపుకు తీసుకెళ్లింది. దీంతో పోలీసులు మృతి చెందారు. కాగా, డ్రైవర్ తాగి ఉన్నట్లుగా తెలుస్తోంది.

Speeding cab driver mows down two cops in Delhi, third critical

నిందితుడిని హేమంత్‌గా గుర్తించారు. అతను ఘజియాబాదుకు చెందిన వాడు. అతను ఎకో కారులో పని చేస్తున్నాడు. కాగా, మృతి చెందిన పోలీసులు జైత్‌పుర్ పోలీసు స్టేషన్‌కు చెందిన వారు. వారు ఏఎస్సై నాగేందర్, కానిస్టేబుల్ ప్రహ్లాద్‌గా గుర్తించారు.

ఢిల్లీ-జైపూర్ హైవేపై కెమికల్ ట్యాంకర్ పేలి 10మంది మృతి

ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారి పైన అదివారం కెమికల్ ట్యాంకర్ పేలి 10 మంది మృతి చెందారు. మరో పన్నెండు మందిగాయపడ్డారు. జైపూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో చాంద్వాజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొనడంతో ట్యాంకరులో ఉన్న కెమికల్ బ్యూటోనిల్ వల్ల మంటలు అంటుకున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+