ఇదీ జరిగింది.. విమానంలో ప్రజ్ఞాసింగ్ వివాదంపై స్పెస్ జెట్ క్లారిటీ
Recommended Video
ప్రముఖ విమానాయాన సంస్థ స్పైస్ జెట్ సిబ్బంది తనను అవమానించారంటూ భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఠాకూర్ వీల్ చైర్‌లో వచ్చినందున నాన్ ఎమర్జెన్సీ వరుసలో కూర్చోవాలని సిబ్బంది ఎంపీని కోరినట్టు తెలిపింది. అయితే అందుకు ఆమె నిరాకరించడమే కాకుండా మొదటి వరుసలోనే కూర్చుంటానని మొండి పట్టు పట్టడంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినట్టు వెల్లడించింది.
ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే 78 సీట్ల సామర్థ్యం గల బొంబార్డియర్ Q400 స్పెస్ జెట్ విమానంలో ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తన టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మొదటి వరుస 'ఎమర్జెన్సీ వరుస' కావడంతో వీల్ చైర్ ప్రయాణికులకు దాన్ని కేటాయించరు.

అయితే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తన సొంత వీల్ చైర్‌లో వచ్చి మొదటి వరుసలో కూర్చోవడంతో సిబ్బంది అందుకు అభ్యంతరం చెప్పారు. నాన్ ఎమర్జెన్సీ వరుస 2 A/Bలోకి మారాల్సిందిగా కోరారు. అయితే ప్రజ్ఞా మాత్రం అక్కడి నుంచి కదిలేందుకు ససేమిరా అన్నారు. తోటి ప్రయాణికులు కూడా ఆమెను అడిగిచూసినప్పటికీ లాభం లేకుండా పోయింది.
భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఎగ్జిట్ డోర్ పాలసీని చూపించాల్సిందిగా ప్రజ్ఞా కోరడంతో.. సిబ్బంది అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆమె ముందుంచారు. వాటిని పరిశీలించిన ప్రజ్ఞా ఠాకూర్ ఎట్టకేలకు 45 నిమిషాల తర్వాత అక్కడి నుంచి నాన్ ఎమర్జెన్సీ వరుసలోకి మారారు. స్పెస్ జెట్ సిబ్బంది తనను అవమానించారంటూ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపణలు చేసిన ఒకరోజు తర్వాత ఆ సంస్థ ఇలా వివరణ ఇచ్చుకుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications