Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం?

తిన్న దగ్గరే ఉమ్మేస్తాం. ఉమ్మిన చోటే తినేస్తాం. నోట్లో పాన్, గుట్కా వేస్కొని తుపుక్‌మని ఉంచితే అదొక ఆనందం. జర్జా నమిలి బస్సు కిటీకీల్లోంచి ఉమ్మేయడం అదో తృప్తి. రైలులో గుట్కా నమిలి అక్కడే ఒక చోట ఉమ్మేస్తే హాయిగా ఉంటుంది. సిగ్గుండాలి.. ఏదో ఇండియాలో కాబట్టి బతికిపోతున్నాం. అదే వేరే దేశాల్లో అయితే ఉమ్మేస్తే సరే..?

అవును.. ఈ రోజుల్లో చాలా మందికి కనీస బుద్ధి కూడా ఉండటం లేదు. గుట్కాలు, పాన్ మసాలాలు నమిలి రోడ్లపై ఎక్కడిపడితే అక్కడ ఉమ్మేస్తూ.. నానా చండాలంగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే పక్కన ఉన్నవాళ్లను చూడకుండానే ఉమ్మేస్తుంటారు. కనీసం పరిశుభ్రత పాటించాలనే సోయి కూడా ఉండదు. ఇక దేశంలోని రైళ్లను చూస్తే మాత్రం.. "ఒరేయ్ ఎవర్రా మీరంతా.. ఎక్కడ్నుంచి వచ్చార్రా.." అనే సినిమా డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఒడిశా వెళ్లే చాలా రైళ్ల గురించి మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన గుట్కా మరకలే కనిపిస్తూ ఉంటాయి. ఇక ముంబైలోని రైలు పట్టాలు చూస్తే.. అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి. రంగు వేశారో లేక తుప్పు పట్టాయనో మీరు భావిస్తే ఉమ్మిలో కాలేసినట్లే. రైలు ప్రయాణికులు పాన్, గుట్కా నమిలి ఉమ్మివేయడంతో ఆ దుస్థితి దాపురించింది. అంత దరిద్రంగా రైళ్లు, రోడ్లు ఎందుకు తయారయ్యాయి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేసే దేశ పౌరులారా.. సిగ్గుతో తలదించుకోండి.

Spitting in Public Places A Threat to Clean India and Public Health

చాలా ప్రాంతాల్లో "ఇచ్చట ఉమ్మేయరాదు" అని రాసిన గోడలు, కొన్ని బోర్డులను చూసుంటాం. కానీ దరిద్రమేమిటంటే.. ఎక్కడైతే అలాంటి బోర్డులు, వాల్ రైటింగ్స్ ఉంటాయో అక్కడే కొందరు ఘనులు ఉమ్మేస్తూ ఉంటారు. అక్కడ ఉమ్మితే ఏమవుతుంది.. అదేమైనా నేరమా? అంటూ రుబాబుగా మాట్లాడారు. మేము ఇలాగే ఉమ్మేస్తాం.. దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ.. ఏదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతారు. ఇలాంటి గొప్పకార్యాలు చేసే మహానుభావులారా.. సిగ్గుతో తలదించుకోండి.

అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా.. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ గుట్కారాయుళ్లు.. గుట్కాలు, పాన్‌లు తినేసి ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తున్నారు. తంబాకు నమిలి తాత జాగీరైనట్లు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తున్నారు. గుట్కా వేసుకుని కంపు వచ్చేలా ఉమ్మి చిమ్మేస్తుంటారు. ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం జన్మహక్కులా ఫీలవుతుంటారు. రోడ్లు, ఇళ్లు, ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలంటూ ఏమీ లేదు.. మేక నమిలినట్లు నమిలామా?.. తుపుక్.. తుపుక్ అని ఉమ్మేశామా అనేదే లెక్క. రోడ్లతో పాటు బస్సుల్లో కూడా ఉంచేస్తుంటారు. ఇలా బహిరంగ ప్రదేశాలను అపరిశుభ్రం చేసే అయోగ్యులారా.. సిగ్గుతో తలదించుకోండి.

ఇలా ఎక్కడ పడితే అక్క ఉమ్మేయడం ఏమైనా మన సంస్కృతిలో భాగమా?.. సంప్రదాయమా?.. దాని వల్ల వచ్చే లాభమేంటి?. చాలా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో పాన్, గుట్కాలు నమిలి ఉమ్మేయడం వల్లే గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొందరు బైకు మీద వెళ్తూ గుట్కా నమిలి రోడ్డుపై తుపుక్.. తుపుక్ అంటూ ఉమ్మేస్తారు.. అలా ఉమ్మేసినపుడు వెనుక వచ్చే ముఖాలపై అది పడుతూ ఉంటుంది. అలా ఉమ్మేశాక సారీ బ్రో.. అంటూ చెప్పేసి దూసుకెళ్లిపోతుంటారు. కనీస జ్ఞానం లేకుండా అలా ఎలా ఉమ్మేస్తారు. మూర్ఖంగా ముఖంపై ఉమ్మేసి, ఇదేంట్రా బాబూ అని అడిగితే ముక్కు ముడుచుకుంటారు. కొందరైతే మొక్కలపై కూడా ఉమ్మేసి మూతి తుడుచుకుంటారు. అలా ఉమ్మితే అది గాల్లో కలుస్తుందా? పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? పక్కవారిపై పడుతుందా? పిల్లలు దానిని ముట్టుకుంటే ఏవైనా వ్యాధులు వస్తాయా? అనే సోయి లేకుండా ఉమ్మేస్తున్న ఓ అజ్ఞానులారా.. సిగ్గుతో తలదించుకోండి.

కట్టు బొట్టు, ఆచారం, సంస్కృతి, సంప్రదాయాల్లో భారతదేశాన్ని మించిన దేశం ఈ ప్రపంచంలోనే లేదు. మన దేశ సంస్కృతిని గౌరవించి ఎన్నో పాశ్చాత్య దేశాలు మన బాటలో నడుస్తుంటే.. మనం ఇంత బతుకు బతుకీ ఇంటెనకాల సచ్చిండనట్లు దేశంలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం అనే దగ్గరే ఎందుకు ఆగిపోతున్నాం. నాగరికత తెలిసిన మనమే అనాగరికులుగా వ్యవహరించడం భావ్యమా. పాశ్చాత్య దేశాలు ఈ విషయాన్ని అనాగరిక చర్యగా భావిస్తుండగా.. ప్రపంచానికి నాగరికత నేర్పించిన మనం అలా చేయడం క్షమించరాని నేరం. అంతెందుకుండి.. బహిరంగంగా ఉమ్మివేయడం అనేది.. మన ఇండియాలో కూడా నిషేధమే. కానీ దానిని ఎవరు పాటిస్తారు సార్..?. చట్టాలు చేసిన ప్రభుత్వాలే కఠినంగా అమలు చేయడం లేదు. మున్సిపల్ చట్టాలున్నా నిషేధం అమలు కావడం లేదు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో మాత్రం పక్కాగా వర్కవుట్ అయింది.. అలాగే దేశం మొత్తం రైళ్లలో ప్రభుత్వం తలచుకుంటే చేయలేదా?.. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తే అమలు కాదా? అధికారులు ఈ అంశంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యం ఉంటాం కదా..?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+