వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షమాపణ: ఎఎపి నేత చెంప చెల్లుమనిపించిన టీనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధికార ప్రతినిధి ఇజాజ్ ఖాన్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఎఎపి సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కూడా కుల రాజకీయాలను అనుసరిస్తున్నారా అనే అంశంపై చర్చ జరుగుతుండగా ఎఎపి మాజీ నేత ఆయనపై చేయి చేసుకున్నారు.

ఓ జాతీయ న్యూస్ ఛానల్లో ఆ అంశంపై చర్చ జరుగుతుండగా ఎఎపి అధికార ప్రతినిధి ఇజాజ్ ఖాన్, ఆ పార్టీ మాజీ సభ్యురాలు టీనా శర్మ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది.

Spokesperson Khan slapped by Tina

ఇరువురి మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో టీనాకు క్షమాపణ చెప్పాలని న్యూస్ యాంకర్ ఇజాజ్ ఖాన్‌ను కోరింది. కానీ ఆయన తిరస్కరించాడు. దీంతో ఇజాజ్ ఖాన్ పక్కనే కూర్చున్న టీనా శర్మ ఒక్కసారిగా లేచి వచ్చి ఆయన చెంపపై చెల్లుమనిపించింది.

కాగా, ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ సృష్టిస్తోంది. ఇప్పటికే దీనిని కొన్ని వేలమంది వీక్షించారు. టీనా శర్మ గతంలో భారతీయ జనతా పార్టీలో పని చేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చాక అందులో చేరింది. ఆ తర్వాత రెబల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీతో కలిసి పార్టీపై అసంతృప్తి ప్రకటించారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/gLMcKHkIhYM?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
AAP spokesperson Ejaz Khan slapped by Teena Sharma on TV show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X