స్కూల్ లో అమ్మాయిలకు బ్లూఫిల్మ్ చూపిస్తున్న టీచర్: వాడు రౌడీషీటర్, ప్రభుత్వ ఉద్యోగి !

విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా తన స్మార్ట్ ఫోన్ లోని అశ్లీల చిత్రాలను విద్యార్థినిలకు చూపించి తన కామవాంచ తీర్చుకుంటున్న టీచర్ ను వెంటనే అరెస్టు చెయ్యాలని విద్యార్థుల కుటుంబ సభ్యులు .

బెంగళూరు: విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా తన స్మార్ట్ ఫోన్ లోని అశ్లీల చిత్రాలను విద్యార్థినిలకు చూపించి తన కామవాంచ తీర్చుకుంటున్న టీచర్ ను వెంటనే అరెస్టు చెయ్యాలని విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగింది.

తుమకూరు జిల్లా కోరటగెరె తాలుకా లంకేనహళ్ళి ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న టీచర్ దేవరాజ్ ను అరెస్టు చెయ్యాలని విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ ముందు ఆందోళన చేస్తున్నారు. దేవరాజ్ చేష్టలతో విద్యార్థినిలు స్కూల్ కు వెళ్లాలంటే భయపడిపోతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వీడు పాఠాలు చెప్పడు !

వీడు పాఠాలు చెప్పడు !

లంకేనహళ్ళి ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న దేవరాజ్ ప్రతి రోజూ స్కూల్ లో అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయిలను ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని వారితో చనువుగా ఉంటున్నాడని తెలిసింది.

స్మార్ట్ ఫోన్ చేతిలో !

స్మార్ట్ ఫోన్ చేతిలో !

టీచర్ దేవరాజ్ నిత్యం తన స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకుని అమ్మాయిలను దగ్గరకు తీసుకుని అందులోని అశ్లీల దృశ్యాలు వారికి చూపిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. మొబైల్ లో ఉన్న దృశ్యాలు చూడటానికి ఇష్టపడని అమ్మాయిలపై ఇతను చెయ్యి చేసుకుంటున్నాడని తెలిసింది.

ఎలా ఉంది అంటూ అభిప్రాయాలు !

ఎలా ఉంది అంటూ అభిప్రాయాలు !

మొబైల్ లోని అశ్లీల దృశ్యాలు అమ్మాయిలకు చూపించిన కామాంధుడు అంతటితో ఆగకుండా ఇది ఎలాగుంది ? అది ఎలాగుంది ? అంటూ వారి అభిప్రాయాలు తెలుసుని అమ్మాయిలను వేధిస్తున్నాడు. ఇతడి చేష్టలతో విసిగిపోయిన విద్యార్థులు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

అందరికి తెలిసిపోయింది !

అందరికి తెలిసిపోయింది !

స్కూల్ లో జరుగుతున్న ఈ తతంగంపై విద్యార్థుల కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు. దేవరాజ్ కు తగిన బుద్ది చెప్పకుంటే మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని గ్రహించారు. వెంటనే విద్యార్థుల కుటుంబ సభ్యులు ఏకం అయ్యి స్కూల్ ముందు ఆందోళనకుదిగారు.

వీడు సామాన్యుడు కాదు !

వీడు సామాన్యుడు కాదు !

టీచర్ దేవరాజ్ కు నేరచరిత్ర ఉందని విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. క్యాతసంద్ర పోలీస్ స్టేషన్ లోని రౌడీషీటర్ల జాబితాలో దేవరాజ్ పేరు ఉందని వెలుగు చూసింది. రౌడీషీటర్ జాబితాలో పేరు ఉన్న వ్యక్తిని ప్రభుత్వం ఎలా టీచర్ గా నయమించింది? అంటూ విద్యార్థుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

వెంటనే సస్పెండ్ చెయ్యండి !

వెంటనే సస్పెండ్ చెయ్యండి !

టీచర్ దేవరాజ్ ను వెంటనే సస్పెండ్ చెయ్యాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని విద్యార్థుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు లంకేనహళ్ళి గ్రామం చేరుకుని విద్యార్థుల కుటుంబ సభ్యులకు నచ్చచెబుతున్నారు.

రాజకీయ నాయకుడి అండతో !

రాజకీయ నాయకుడి అండతో !

తుమకూరు జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి అండతో కామాంధుడు దేవరాజ్ రెచ్చిపోతున్నాడని విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. పిల్లలకు పాఠాలు చెప్పడం తప్పా ఇతడు అన్ని పనులు చేస్తున్నాడని వారు ఆరోపించారు. దేవరాజ్ ను సస్పెండ్ చేసే వరకు మా పిల్లలను స్కూల్ కు పంపించమని విద్యార్థుల కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. విద్యాశాఖ అధికారులు, పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+