స్పాట్ పెట్టిన స్పాటిఫై

ముంబై: స్వీడన్‌కు చెందిన ప్రముఖ వెబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై.. ఉద్యోగులకు స్పాట్ పెట్టింది. లే ఆఫ్ బాట పట్టింది. 200 మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సంస్థలో పని చేస్తోన్న మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం వరకు కుదించనున్నట్లు తెలిపింది. పాడ్ కాస్ట్ డివిజన్‌లో లే ఆఫ్‌ను అమలు చేయనున్నట్లు పేర్కొంది స్పాటిఫై సంస్థ యాజమాన్యం.

క్రియేటర్లను నియమించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పాటిఫై యాజమాన్యం వివరించింది. 100 మిలియన్ పాడ్‌ క్యాస్ట్ ఆడియన్స్ ఉన్నారు ఈ సంస్థకు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఆడియో పాడ్‌ కాస్ట్ ప్లాట్‌ఫామ్ ఇదే. పాడ్ కాస్ట్ విభాగంలో ఉద్యోగులను తొలగించి- క్రియేటర్లను నియమించుకుంటామని, క్రియేటివిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది.

Spotify

ఆడియన్స్‌కు మరింత మెరుగైన ఆవిష్కరణలను అందించగలుగుతామని, మానిటైజేషన్‌ సులభతరమౌతుందని అభిప్రాయపడింది. పాడ్ కాస్ట్ విభాగంలో వేటును ఎదుర్కొనబోయే ఉద్యోగులతో ఇప్పటికే హెచ్ఆర్ సిబ్బంది లేఆఫ్ సమాచారాన్ని అందజేశారని, సంస్థ నియమ నిబంధనల ప్రకారం.. వారికి ప్యాకేజీ, హెల్త్ కవరేజీ, అవుట్‌ ప్లేస్‌మెంట్ సపోర్ట్‌ను అందజేస్తామని వివరించింది.

లే ఆఫ్‌ను ప్రకటించడం స్పాటిఫై సంస్థకు ఇది రెండోసారి. గతంలో ఆరు శాతానికి పైగా ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. 600 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది. మ్యూజిక్ స్ట్రీమింగ్, పాడ్ కాస్ట్ ద్వారా సంస్థ ఆదాయాలను పెంపొందించుకోవడానికి సంస్థ యాజమాన్యం బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.

Spotify

పాడ్‌ కాస్ట్ విభాగం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావించినప్పటికీ.. దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొనడమే లేఆఫ్‌కు దారి తీసినట్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాడ్‌కాస్టర్‌లతో తాము భాగస్వామ్యం కావడానికి ప్రయత్నిస్తోన్నామని, దీన్ని మరింత విస్తరించుకోవడం, ఇతర దేశాల పాడ్‌కాస్టర్లకు అవకాశాలను కల్పించాలని నిర్ణయించినట్లు వివరించింది కంపెనీ యాజమాన్యం.

ప్రపంచవ్యాప్తంగా స్పాటిఫైలో 9,500 మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. స్పాటిఫై ప్లాట్‌ఫారం ఈ రంగంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నప్పటికీ అది చాలట్లేదు. యాపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఉంది. ఫలితంగా నష్టాలను వస్తోన్నట్లు చెబుతంది స్పాటిఫై. మున్ముందు మరిన్ని లే ఆఫ్స్ ఉండకపోవచ్చనే అంచనాలు సైతం వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+