పైకి షూటింగ్, లోపల చీకటి దందా: ఫాంహౌజ్‌లో వెలుగుచూసిన క్యాసినో..
బయటి వ్యక్తులకు మాత్రం అక్కడేదో షూటింగ్ జరుగుతుందన్న భ్రమ కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న జూద కార్యకలాపాలను ఢిల్లీ పోలీసులు బట్టబయలు చేశారు. డేరా మండీలో కాసినో తరహాలో ఈ చీకటి దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. పైగా.. బయటి వ్యక్తులకు మాత్రం అక్కడేదో షూటింగ్ జరుగుతుందన్న భ్రమ కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని డేరామండీ ప్రాంతంలో 13 ఎకరాల లగ్జరీ ఫామ్ హౌస్ ఉంది. సినిమా షూటింగ్స్ నిమిత్తం ఇక్కడో డమ్మీ క్యాసినో బార్ కూడా ఏర్పాటు చేశారు. కానీ షూటింగ్స్ పేరుతో ఇటీవల ఇక్కడ నిజంగానే క్యాసినో నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చాలారోజుల నుంచి దీనిపై ఫోకస్ చేసిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు.

దాడుల్లో జూదం ఆడుతున్న 14 మంది సహా ఐదుగురు యువతులు పట్టుబడ్డారు. 13 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు లక్షల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ కూడా అక్కడ లభించాయి. కాగా, గోవా, సిక్కిం, డామన్ లలో మాత్రమే ఇండియాలో క్యాసినోలకు అనుమతి ఉంది. డేరామండీలో అక్రమంగా క్యాసినో నిర్వహిస్తుండటంతో వారిపై కేసులు నమోదు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications