వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపోజల్ తిరస్కరణ: పోర్న్ సైట్‌లో లేడీ ఫ్రెండ్ ఫొటో

|
Google Oneindia TeluguNews

Spurned Delhi youth puts up Mumbai student's profile on porn site
ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ అమ్మాయికి సంబంధించిన వివరాలతోపాటు ఆమె ఫోన్ నెంబర్, ఫొటోనూ పోర్న్ సైట్‌లో పోస్ట్ చేసిన కేసులో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఇంజినీర్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పిన వివరాల ప్రకారం.. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తనకు దేశ వ్యాప్తంగానే కాక కెనడా, ఆస్ట్రేలియా దేశాల నుంచి కూడా అసభ్యమైన ఫోన్ కాల్స్ రావడంతో ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి(20)ని పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు విచారణ జరిపేందుకు సీనియర్ అధికారి ముకుంద్ పవార్ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల విచారణలో ఫిర్యాదు చేసిన విద్యార్థిని నివాసం ఉంటున్న చెంబుర్ హౌజింగ్ సొసైటీలోనే నిందితుని బంధువులు ఉంటున్నట్లు తేలింది.

గత అక్టోబర్‌లో హౌజింగ్ సొసైటీలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చిన నిందితుడు, ఆ విద్యార్థినితో స్నేహం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత నవంబర్‌లో నిందితుడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే ఆ అమ్మాయి నిరాకరించడంతో.. ఆమెపై కోపం పెంచుకున్న నిందితుడు ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆమె వివరాలను ఓ పోర్న్ సైట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ అమ్మాయికి గత డిసెంబర్ నెల నుంచి అసభ్యకరమైన కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి.

ఆ విధంగా తనకు ఫోన్ చేసిన ఓ వ్యక్తిని.. తన నెంబర్ ఎలా లభించిందని బాధితురాలు ప్రశ్నించింది. తాను ఓ పోర్న్ సైట్ చూసి ఫోన్ చేశానని ఆ కాలర్ చెప్పడంతో బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని న్యూఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కూడా తన నేరాన్ని అంగీకరించాడు. కాగా నిందితుడు బాధితురాలికి తెలిసిన వారి బంధువు కావడంతో ఆమె తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. దీంతో పోలీసులు నిందితుడ్ని విడుదల చేశారు.

English summary
Mumbai cyber crime investigation cell ( CCIC) detained a 21-year-old computer engineering student from New Delhi last week for allegedly posting a girl's photos, personal details and mobile number on a porn website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X