మాజీ ప్రేయసిపై పగ: ఫేస్‌బుక్‌లో బూతు ఫోటోలు
చెన్నయ్: వాట్సాప్ లో అసభ్య చిత్రాలు, ఫేస్ బుక్ లో అసభ్యంగా మెసేజ్ లు, ఫోటోలను పంపిస్తు మహిళను వేధిస్తున్న యువకుడిని చెన్నయ్ సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నయ్ లోని పెరంబూరులోని వెంకట్రామన్ వీధిలో నివాసం ఉంటున్న విమల్ నాథ్ (27) అనే యువకుడిని అరెస్టు చేశారు.
ఇతను ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. తిరుముల్లైవాయల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న లత అనే మహిళ చెన్నయ్ నగర పోలీసు కార్యాలయంలో విమల్ నాథ్ మీద ఫిర్యాదు చేసింది. తనకు వివాహం అయ్యిందని, తన భర్త విదేశాలలో ఉన్నాడని సమాచారం ఇచ్చింది.
గతంలో తాను, విమల్ నాథ్ ప్రేమించుకున్నామని, తరువాత అతని చెడు అలవాట్ల కారణంగా తాను అతనికి దూరం అయ్యానని లత కమిషనర్ కు చెప్పింది. తరువాత తన పేరుతో విమల్ నాథ్ నకిలి ఫేస్ బుక్ ప్రారంభించాడని సమాచారం ఇచ్చింది.

నకిలి ఫేస్ బుక్ అకౌంట్ లో తన ఫోటో అప్ లోడ్ చేశాడని, అసభ్య చిత్రాలు, ఫోటోలను తన బంధువులకు, స్నేహితులకు పంపించి వేదిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అంతే కాకుండ వాట్సాప్ లో తన భర్తకు అసభ్యంగా మేసేజ్ లు పంపింస్తున్నాడని చెప్పింది.
తనను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్న విమల్ నాథ్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విమల్ నాథ్ ను అరెస్టు చేశారు. తను లత ప్రేమించుకున్నామని, జాతకాలు కుదరలేదని మోసం చేసి వెళ్లిపోయిన లత మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేశానని విమల్ నాథ్ అంగీకరించాడని సీసీబీ పోలీసులు తెలిపారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications