తన ప్రేమను నిరాకరించిందని క్లాస్‌మేట్‌పై యాసిడ్ దాడి
కానింగ్: తన ప్రేమను నిరాకరించిందనే నెపంతో ఓ ప్రబుద్ధుడు తన క్లాస్‌మేట్‌పై యాసిడ్ దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రి పాలైంది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి బిఏ మొదటి సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా ఆమె క్లాస్‌మేట్ ఇనాముల్ సర్దార్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఈ క్రమంలోనే బెలిగచీ గ్రామంలో ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నిందితుడు ఆమెను అడ్డుకుని తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో ఆ యువతిపై నిందితుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన నిందితుడ్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధిత యువతిని హుటాహుటిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంత నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications