వన్‌సైడ్ లవ్: ప్రేమిస్తున్నానని చెల్లెలికి వేధింపులు, నిశ్చితార్ధానికి ముందే హత్య
చెన్నై: చెల్లెలు వరుసైన అమ్మాయిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. మరో యువకుడితో ఆ యువతికి వివాహ నిశ్చితార్ధం అవుతోందన్న నెపంతో కత్తితో పొడిచి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలోని కీరమంగళంలో చోటు చేసుకొంది.
ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధింపులకు గురిచేయడం పరిపాటుగా మారింది. వన్ సైడ్ లవ్ పేరుతో అమ్మాయిలను వేధించడం, వినకపోతే చంపేయడం వంటి ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం.
వావి వరుసలు మరిచిపోయి బాబాయి కూతురినే ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. తనకు దక్కని ఆ అమ్మాయి మరోకరికి దక్కకూడదనే అక్కసుతో ఆ యువతికి మరికొన్ని గంటట్లోనే నిశ్చితార్ధం జరగాల్సి ఉండగా ఆమెను హత్య చేశాడు దుర్మార్గుడు.

చెల్లెలితో ప్రేమాయణం
వరుసకు చెల్లెలైన యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. అంతేకాదు మరో యువకుడితో ఆ యువతికి వివాహం నిశ్చితార్థం జరిగేందుకు కొన్ని గంటల ముందే ఆ యువతిని సత్యకుమార్ కత్తితో పొడిచి చంపేశాడు. వన్‌సైడ్ లవ్ పేరుతో ఆ యువతిని వేధింపులకు గురిచేశాడు. చివరకు తనకు దక్కని ఆ యువతి వేరొకరిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని శివ సుబ్రమణ్యన్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు.

వన్‌సైడ్ లవ్
తిరుచ్చి నెం.1 టోల్ గేట్ సమీపంలోని కీరమంగలంకు చెందిన శివ సుబ్రమణ్యన్ కూతురును సత్యకుమార్ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. పట్టభద్రురాలైన హేమలత తిల్లె నగర్‌లోని ఓ మొబైల్ నెట్ వర్కింగ్ సంస్థలో పనిచేస్తుంది. శివ సుబ్రమణ్యన్‌కు వరుసకు అన్న అయిన జ్ఞాన సంబంధం కుమారుడు సత్యకుమార్(30) ప్రతిరోజూ ఆ యువతిని తన బైక్‌లో ఆ సంస్థ వద్ద డ్రాప్ చేసేవాడు. ఈ రెండు కుటుంబాల మధ్య హఠాత్తుగా విభేదాలు తలెత్తాయి.

ప్రేమిస్తున్నానని చెప్పిన సత్యకుమార్
ఆ యువతిని తాను ప్రేమిస్తున్నవిషయాన్ని సత్యకుమార్ చెప్పాడు. అయితే తనకు సోదరుడి వరుస అవుతాననే విషయాన్ని మర్చిపోయావా అంటూ ఆ యువతి సత్యకుమార్ ను నిలదీసింది. సత్యకుమార్ తీరు నచ్చకపోవడంతో అతడిని దూరం పెట్టింది.అంతేకాదు ఈ విషయం ఇంట్లో కొంత కాలం చెప్పకుండా దాచింది. కానీ, సత్య కుమార్ వేధింపులు తీవ్రం కావడంతో ఆమె చెప్పేసింది. దీంతో ఆ యువతికి మరో యువకుడితో నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు

నిశ్చితార్థం ఏర్పాట్లలో ఉండగానే హత్య
ఆ యువతికి బుధవారం తిరుచ్చికి చెందని ఓ యువకుడితో వివాహ నిశ్చితార్ధానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి హఠాత్తుగా ఇంట్లోకి వెళ్లిన సత్యకుమార్ తన చేతిలోని వేట కత్తితో శివసుబ్రమణ్యంను నరికాడు. అడ్డొచ్చిన అతని సోదరుడు వైరవేల్‌ను సైతం కత్తితో దాడి చేశాడు. వీరి కేకలు విని హేమలత బయటకు వచ్చింది. ఆ ప్రేమోన్మాది కత్తితో హేమలత గొంతు మీద నరికాడు. ఈ సంఘటన నుంచి తేరుకున్న ఇతర కుటుంబీకులు సత్యకుమార్‌ను అడ్డుకునే యత్నం చేయడంతో ఉడాయించాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హేమలత మరణించింది.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications