శ్రీ శ్రీ రవిశంకర్‌కు తాలిబన్ల నుంచి బెదిరింపు లేఖ
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్‌కు పాకిస్ధాన్‌కు చెందిన తీవ్రవాద సంస్ధ నుంచి బెదిరింపు లేఖ వచ్చినట్లు సమాచారం. పాకిస్ధాన్‌కు చెందిన తెహ్రిక్-ఇ-తాలిబన్ సంస్ధ ఆయన ఆఫీసుకు రెండు లేఖలు రాసింది.
ఆ లేఖలో నిన్ను, నీ అనుచరులను చంపేస్తామంటూ ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర నిఘా వర్గల సమాచారంతో స్ధానిక పోలీసులు అప్రమత్తమయ్యారు.

గతంలోనూ రవిశంకర్‌కు బెదిరింపు లేఖలు వచ్చాయి. కాగా, పండిట్ రవిశంకర్‌కు హిందూ ఆధ్యాత్మిక వేత్తగా, వ్యక్తిత్వ వికాస గురువుగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శిష్యులు, అభిమానులు ఉన్నారు. తాజా బెదిరింపు లేఖలతో వారంతా కాస్త ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications