బాత్‌టబ్‌లో పడితే: శ్రీదేవిపై అనుమానాలకు సమాధానాలు!! అందుకే ఎన్నో డౌట్స్

ముంబై: ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతి కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఆమె ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి చనిపోయినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుతూ కనిపించిన శ్రీదేవి ఉన్నపళంగా బాత్ టబ్‌లో పడి చనిపోవడమేమిటన్న అనుమానాలు వస్తున్నాయి.

Recommended Video

    Sridevi Passes Away: It's Not A Cardiac Arrest, Twist ?

    బాత్ టబ్ మరణాలు విదేశాల్లో సహజమే అంటున్నారు. ముఖ్యంగా జపాన్, అమెరికాలో బాత్ టబ్ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. జపాన్‌లో బాత్ టబ్ సంబంధిత మరణాలు జాతీయ విషాదంగా మారాయి. ఏడాదికి 19వేల మరణాలు ఇలా జరిగినట్లు 2017 మార్చిలో జర్నల్ ఆఫ్ జనరల్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ పత్రికలో ఓ అధ్యయనం వెల్లడించింది.

    బాత్ టబ్ మరణాలు పెరుగుతున్నాయి

    బాత్ టబ్ మరణాలు పెరుగుతున్నాయి

    గడిచిన పదేళ్లలో ఈ తరహా మరణాలు డెబ్బై శాతం పెరిగాయని, వీటిల్లో ప్రతి పదింటిలో తొమ్మిదిమంది అరవై అయిదేళ్లకు పైగా వృద్ధులేనని జపాన్ వినియోగదారుల వ్యవహారాల ఏజెన్సీ 2016లో వెల్లడించింది. జపనీయులు 41 సెల్సియస్‌కు పైగా వేడినీళ్లతో స్నానం చేయడం, బాత్‌టబ్‌ల లోతు ఎక్కువ ఉండటం ఇందుకు కారణం.

    మద్యం మత్తులో..

    మద్యం మత్తులో..

    2006లో అమెరికా ఫెడరల్ మోర్టాలిటీ డాటా ప్రకారం బాత్ టబ్, హాట్ టబ్, స్పా వంటి వల్ల రోజుకు ఒకరు మృతి చెందుతున్నారు. మృతుల్లో అత్యధికులు డ్రగ్స్, మద్యం మత్తులో చనిపోతున్నారట. పదిహేను ఏళ్లకు పైగా ఉన్న రెండు లక్షలమంది ప్రతి ఏడాది బాత్రూం గాయాలకు గురవుతున్నారని, అందులో 14 శాతం మంది ఆసుపత్రి పాలవుతున్నారని ఓ నివేదిక తెలిపింది. మన దేశంలో మాత్రం బాత్రూం ప్రమాదాల గురించి పెద్దగా అధ్యయనాలు జరిగింది లేదు. ప్రమాదాల వల్ల గాయపడటం మినహా, చనిపోయిన దాఖలాలు లేవు.

     బాత్ టబ్ వల్ల ప్రాణాలు విడిచారు

    బాత్ టబ్ వల్ల ప్రాణాలు విడిచారు

    హాలీవుడ్ నటుడు జిమ్ మారిసన్ 1971లో బాత్ టబ్‌లో పడి మృతి చెందాడు. పాప్ గాయని విట్నీ హూస్టన్ కూడా 2012లో తన హోటల్ గదిలో బాత్ టబ్‌లో విగతజీవిగా కనిపించింది. ప్రముఖ గాయకులు బాబీ బ్రౌన్, విట్నీ హూస్టన్ దంపతుల కుమార్తె బాబీ కృష్ణా బ్రౌన్ కూడా 2015లో బాత్ టబ్‌లో ప్రాణాలు విడిచింది.

    1980ల నాటి నుంచే తాగుడు అలవాటు

    1980ల నాటి నుంచే తాగుడు అలవాటు

    శ్రీదేవికి 1980ల నాటి నుంచే తాగుడు అలవాటు ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆమె వైన్ మాత్రమే తాగేదని అమర్ సింగ్ చెబుతున్నారు. శ్రీదేవి మృతి వార్త 24వ తేదీన రాత్రి 11 గంటలకు బయటకు వచ్చింది. కానీ కుటుంబ సభ్యులు కార్డియాక్ అరెస్ట్ అని చెప్పడం, ఫోరెన్సిక్ రిపోర్టులో అలా ఉండకపోవడం అసలు అనుమానాలకు తావిస్తోంది.

     అందుకే మృతిపై అనుమానాలు

    అందుకే మృతిపై అనుమానాలు

    శనివారం రాత్రి 11 గంటలకు శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఫోరెన్సిక్‌ నివేదిక మాత్రం ఆమె బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆమె రక్తంలో మద్యం ఆనవాళ్లు కూడా కన్పించాయని పేర్కొన్నారు. దాంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బోనీ కపూర్‌ను విచారించలేదని, ఆదివారం ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+