ఆరోగ్య సమస్యల్లేవు, శ్రీదేవి గుండెపోటుతో చనిపోవడంతో షాకయ్యాం: సంజయ్
ముంబై: నటి శ్రీదేవికి ఎలాంటి హృద్రోహ సమస్యలు లేవని ఆమె బంధువు సంజయ్ కపూర్ ఆదివారం వెల్లడించారు. దుబాయ్‌లో బంధువుల పెళ్లి కోసం వెళ్లిన అలనాటి నటి శ్రీదేవి హఠాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసిందే.
Recommended Video

ఆమె ఆరోగ్యం విషయమై సంజయ్ కపూర్ స్పందించారు. మేనల్లుడి వివాహం కోసం కుటుంబంతో కలిసి దుబాయ్ వచ్చిన శ్రీదేవి శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

హోటల్ గదిలో స్పృహకోల్పోయారు
తన హోటల్ గదిలో శ్రీదేవి స్పృహ కోల్పోయి కనిపించినట్లు సంజయ్ కపూర్ వెల్లడించారు. వెంటనే దుబాయ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారని అన్నారు.

శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందంటే నమ్మలేకపోతున్నాం
శ్రీదేవికి సాధారణంగా ఎలాంటి హృద్రోగ సమస్యలు లేవని, గుండెపోటుతో చనిపోయిందంటే నమ్మలేకపోతున్నామని సంజయ్ కపూర్ తెలిపారు. శ్రీదేవి మరణ వార్తను విని వెంటనే దుబాయ్ బయలుదేరినట్లు చెప్పారు.

హోటల్లో బస, అక్కడే ఇలా
మోహిత్ మార్వా పెళ్లి కోసం కొద్ది రోజుల క్రితం శ్రీదేవి కుటుంబం యూఏఈ చేరుకుంది. ఆమె జూమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో బస చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఆమెకు గుండె నొప్పి రావడంతో బాత్రూంలోనే సృహ కోల్పోయారని, ఆమెను రషీద్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ విషయం తెలిసి షాకయ్యాం
శ్రీదేవి మృతిని సంజయ్ కపూర్ ధ్రవీకరించారు. ఆమెకు గుండెనొప్పి వచ్చిందని చెప్పారని, దీంతో మేమంతా షాకయ్యామని, అసలు ఆమెకు అలాంటి సమస్య ఉన్నది ఏదీ లేదని చెప్పారు. విషయం తెలియగానే సంజయ్ కపూర్, కుటుంబ సభ్యులు యూఏఈకి వెళ్లారు.

సోమవారం అంత్యక్రియలు
శ్రీదేవి అంత్యక్రియలు సోమవారం ముంబైలో మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్నాయి. అంతకంటే ముందు శ్రీదేవి ఇంటి నుంచి మెహబూబా స్టూడియోకు ఆమె పార్థివ దేహాన్ని టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, అభిమానుల సందర్శనార్థం తీసుకు రానున్నారు. అనంతరం శాంతాక్రూజ్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

కూతురు సినిమా చూడకుండానే
బోనీ కపూర్ మొదటి భార్య మోనా షౌరీతో విడిపోయాక శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు. భర్త లేరనే బాధతో ఆమె 2012లో చనిపోయారు. అయితే అప్పటికే ఆమె కొడుకు అర్జున్ కపూర్ సినిమాలో నటిస్తున్నాడు. 2012 మేలో ఆ సినిమా విడుదల కావాల్సి ఉండగా, అర్జున్ తల్లి మార్చిలో మృతి చెందారు. తన కొడుకు మొదటి సినిమాను చూడలేకపోయారు. ఇప్పుడు శ్రీదేవి తన కూతురు జాన్వి దడక్ మొదటి సినిమాను చూడకుండానే మృతి చెందారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications