వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు: వీఐపీలతో లింక్, సాక్షుల విచారణ, ప్రాణహాని!

|
Google Oneindia TeluguNews

చెన్నై: కాలేజ్ అమ్మాయిలను మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్లకు లైంగిక కోరిక తీర్చాలని ఒత్తిడి చేసిన నిర్మలా దేవి కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. నిర్మలా దేవితో పాటు అరెస్టు అయిన మదురై కామరాజర్ యూనిర్శిటి ప్రొఫెసర్ మురుగన్ షాక్ ఇచ్చాడు. నిర్మలా దేవి కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులకు సాక్షులను రహస్యంగా విచారణ చెయ్యాలని ప్రత్యక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వీఐపీలకు గాలం

వీఐపీలకు గాలం

కాలేజ్ అమ్మాయిలను గాలం వెయ్యడానికి అనేక మంది వీఐపీలకు ప్రొఫెసర్ నిర్మలా దేవీ గాలం వేశారని విచారణలో వెలుగు చూసిందని యూనివర్శిటి ప్రొటెక్ట్ కమిటీ అధికారులు అంటున్నారు. నిర్మలా దేవి నోరువిప్పితే వారి వివరాలు వెలుగు చూస్తాయని అంటున్నారు.

కోర్టులో నిజాలు చెప్తా

కోర్టులో నిజాలు చెప్తా

నిర్మలా దేవి చాల మందితో సంబంధాలు పెట్టుకునిందని, ఆమె సిట్ అధికారులకు అన్ని అపద్దాలు చెప్పిందని, కేసు తప్పుదోవపట్టించడానికి ప్రయత్నిస్తున్నదని మదురై కామరాజర్ యూనివర్శిటికి చెందిన ప్రొఫెసర్ మురుగన్ ఆరోపిస్తున్నాడని పోలీసులు చెప్పారు.

చంపేస్తారని భయం

చంపేస్తారని భయం

నిర్మలా దేవి వ్యవహారంలో అనేక మంది పెద్దలు ఉన్నారని మురుగన్ చెబుతున్నాడని పోలీసులు అన్నారు. నిర్మలా దేవితో మురుగన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని మురుగన్ కోర్టు ముందు మనవి చేశారు.

రహస్య విచారణ

రహస్య విచారణ

నిర్మలా దేవి కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులు తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూర్ కోర్టులో హాజరైనారు. నిర్మలా దేవి కేసులోని 31 మంది సాక్షులను రహస్యంగా, వేర్వేరుగా విచారణ చెయ్యాలని శ్రీవల్లిపుత్తూర్ కోర్టు సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

వీఐపీలకు చెక్

వీఐపీలకు చెక్

కాలేజ్ అమ్మాయిలను వీఐపీలకు సరఫరా చెయ్యడానికి నిర్మలా దేవీ చాల ప్రయత్నాలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వీఐపీలను తప్పించడానికి నిర్మలా దేవి ప్రయత్నాలు చేస్తోందని గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసుతో చాల మందికి సంబంధాలు ఉన్నాయని మురుగన్ చెప్పడంతో కేసు కొత్తమలుపు తిరిగింది.

English summary
Srivilliputhur court order to enquire 31 witness in secret way. If Nirmala Devi will open her mouth and say truth then more VIPs will be trapped, an University Protect committee official says. Professor Murugan says that there is life threat for him and his family. Court has to ensure the protection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X