Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాకేమైనా అయ్యాకే స్టాలిన్ సీఎం: కరుణానిధి, విజయకాంత్ ప్రమాణం

చెన్నై: తనకు ఏమైనా అయ్యేదాకా స్టాలిన్ వేచి చూడాల్సిందేనని, డీఎంకే గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అని ఆ పార్టీ అధ్యక్షులు కరుణానిధి అన్నారు. ప్రకృతి నన్ను ఏమైనా చేసేదాకా ముఖ్యమంత్రి అవడానికి తన కుమారుడు స్టాలిన్ ఎదురు చూడాల్సిందేనని చెప్పారు. తన వారసుడు స్టాలినే అన్నారు.

జయలలిత ఎన్నికల మేనిఫెస్టో మిగతా పార్టీల నుంచి కాపీ కొట్టిందని కరుణానిధి విమర్శించారు. ఆ పార్టీది కాపీ చేసిన మేనిఫెస్టో అని, అందులో చెప్పిన ఉచిత పథకాలన్నీ ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికే అని ఎద్దేవా చేశారు. అంతేగాక ఎన్నికల తేదీ ప్రకటించగానే తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు.

కానీ అన్నాడీఎంకే మాత్రం ఆలస్యం చేసిందన్నారు. ఒకవేళ ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి మేనిఫెస్టో వెలువడుతుందేమోనని తాను అనుకున్నానని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఉచిత మొబైల్‌ ఫోన్లు, ఉచిత విద్యుత్‌ లాంటివన్నీ నిజంగా జరిగేవి కాదన్నారు.

Stalin can be CM only after me, says Karunanidhi

విజయకాంత్ ప్రమాణం

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు ఇచ్చి ఓటర్లను మభ్యపెట్టనంటూ కెప్టెన్‌ విజయకాంత్‌ ఉలుందూరుపేటలోలని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం నాడు ప్రతిజ్ఞ చేశారు. ఈ విషయమై ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

డీఎండీకే - ప్రజాసంక్షేమ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్‌ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఉలుందూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జాతకాలు, నాడీ జ్యోతిష్యాలపై అపార నమ్మకం ఉన్న విజయకాంత్‌ ఈసారి తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న ధీమాతో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+