డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ఎన్నిక
పార్టీ వర్కింగ్ ప్రెైసిడెంట్ గా స్టాలిన్ ఎన్నికయ్యారు . ఇవాళ చెన్నెలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం స్టాలిన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకొంది.
చెన్నై:డిఎంకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువ నాయకుడు స్టాలిన్ ను ఎన్నుకొన్నారు. . ఇవాళ పార్టీ సర్వభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టాలిన్ ను ఎన్నుకొన్నారు.
డిఎంకె పార్టీలో కరుణానిధి తర్వాత కొత్త నాయకత్వంలో పార్టీ పనిచేయనుంది. 48 ఏళ్ళ తర్వాత కొత్త నాయకుడి నేతృత్వంలో పార్టీ పనిచేయనుంది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకొంది.

ఇవాళ పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ను ఎన్నుకొన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే పార్టీ నాయకత్వం మార్పు చేయాలని కరుణా నిధి బావించారు. స్టాలిన్ కు భాద్యతలను అప్పగించారు.

పార్టీ కోశాధికారిగా కూడ స్టాలిన్ ఉన్నారు. ఈ బాద్యతలను కూడ స్టాలిన్ కొనసాగనున్నారు. తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని ప్రకటించిన కరుణానిధి ఆయనకు పగ్గాలను అప్పగించారు.












Click it and Unblock the Notifications