బ్లాస్ట్ కాదు.. వేస్ట్: రీల్స్ సీఎం అనిపించుకోవద్దు- విజయ్ కు స్టాలిన్ హితబోధ

తమిళనాడు రాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ టీవీకే ప్రభుత్వం తన మొట్టమొదటి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను సభ ముందుకు తెచ్చింది. ఆర్థిక శాఖ మంత్రి మరియా విల్సన్ ఈ ఉదయం దీన్ని సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. తమిళనాడు సమగ్ర ప్రగతి కోసం కట్టుబడి ఉన్నామని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేలా ఈ ప్రతిపాదనలకు రూపకల్పన చేశామని అన్నారు.

బడ్జెట్ ప్రతిపాదనలపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఘాటు విమర్శలు సంధించారు. ఈ బడ్జెట్ మధ్య తరగతితో పాటు మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువత.. ఇలా అన్ని వర్గాల వారినీ తీవ్ర నిరాశ కలిగించిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తుందని భావించినప్పటికీ, ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందంటూ మండిపడ్డారు. విజయ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఈ బడ్జెట్ తో ఒరిగిందేమీ లేదని అన్నారు.

Stalin Slams Vijay as Reels CM and People were expecting Blast budget but it has turned in to Waste

ద్రవిడ మోడల్ గా ప్రభుత్వం అభివర్ణించినప్పటికీ.. ఒక్క నూతన పథకం కూడా ప్రతిపాదించలేదని స్టాలిన్ విమర్శించారు. ఓ రీమేక్ వెర్షన్ బడ్జెట్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రధానంగా వేధిస్తున్న రైతుల సమస్యలు, గందరగోళంగా మారిన విద్యుత్ ఛార్జీల విధానం, రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరల నియంత్రణ వంటి కీలకమైన హేతుబద్ధ ప్రజా సమస్యలపై ఎలాంటి స్పష్టమైన పరిష్కారాన్ని బడ్జెట్‌లో చూపించలేదని ధ్వజమెత్తారు.

కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!
కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆశించిన బడ్జెట్ కాస్తా చివరికి నిరుపయోగంగా మారిపోయిందని, అధికార పక్షం ప్రచారం చేసుకున్న స్థాయికి తగ్గట్లుగా కేటాయింపులు లేవని స్టాలిన్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నూతనంగా ఎటువంటి దీర్ఘకాలిక దార్శనికతతో కూడిన నూతన ప్రాజెక్టులను కూడా ఇందులో ప్రతిపాదించలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక ప్రధాన వాగ్దానాల ప్రస్తావన ఈ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు.

డీలిమిటేషన్ బిల్లు కోసం కేంద్రం బిగ్ స్టెప్.. ఇక తప్పట్లేదు!!
డీలిమిటేషన్ బిల్లు కోసం కేంద్రం బిగ్ స్టెప్.. ఇక తప్పట్లేదు!!

మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 వరకు ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీపై నిధులు కేటాయించలేదని, నిరుద్యోగ యువతకు నెలవారీగా రూ. 4,000 చొప్పున భృతి కల్పిస్తామన్న వాగ్దానాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టారని స్టాలిన్ మండిపడ్డారు. పేద కుటుంబాలకు సంవత్సరానికి ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతుల పూర్తి పంట రుణాల మాఫీ వంటి కీలకమైన హామీల ఆచరణపై ప్రభుత్వం పెదవి విప్పకపోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

పొరుగు రాష్ట్రంతో వివాదాల్లేకుండా పరిష్కారం చూపండి: కేంద్రానికి రేవంత్ రెడ్డి వినతి
పొరుగు రాష్ట్రంతో వివాదాల్లేకుండా పరిష్కారం చూపండి: కేంద్రానికి రేవంత్ రెడ్డి వినతి

విజయ్ తన స్థాయికి తగ్గట్టే బ్లాస్ట్ బడ్జెట్ ఇస్తాడని ప్రజలు ఆశించగా.. దీనికి భిన్నంగా ఆయన వేస్ట్ బడ్జెట్ ఇచ్చాడని స్టాలిన్ చురకలు అంటించారు. సోషల్ మీడియాలో విజయ్ కు రీల్స్ సీఎంగా గుర్తింపు ఉందని, దాన్ని నిలబెట్టుకునేలా ఆయన పాలన సాగిస్తోన్నారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+