స్టాలిన్‌కు కోపం: చెంప చెల్లుమంది (వీడియో)
చెన్నయ్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, డీఎంకే నాయకుడు ఎం.కే. స్టాలిన్ కు కోపం వచ్చింది. అంతే ఎదురుగా నిలబడి ఉన్నప్రయాణికుడి చెంప చెల్లుమనిపించాడు. ఈ సంఘనటతో డీఎంకే పార్టీ కార్యాకర్తలతో పాటు మెట్రో ప్రయాణికులు షాక్ కు గురైనారు.
బుధవారం స్టాలిన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మెదటి సారి మెట్రో రైలు ఎక్కారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఎదరుగా ఒక ప్రయాణికుడు నిలబడి ఉన్నాడు. అతనిని పక్కకు వెళ్లాలని డీఎంకే కార్యకర్తలు సూచించారు.

అయితే అతను అక్కడే ఉన్నాడు. స్టాలిన్ కలగజేసుకుని ఇక్కడి నుండి వెళ్లాలని అతనికి గట్టిగా చెప్పాడు. అయినా అతను అక్కడే ఉండటంతో స్టాలిన్ అతని చెంప చెల్లుమనిపించాడు. ఆ సందర్బంలో అక్కడే ఉన్న ప్రయాణికుడు తన మొబైల్ లో ఆదృశ్యాలు రికార్డులు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు.
స్టాలిన్ చెయ్యి చేసుకున్నారని తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత విచారణ చేపట్టాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. అయితే అమ్మాయిలను వేధిస్తుంటే తాను మందలించడానికి ప్రయత్నించిన సమయంలో చెయ్యి తగిలిందని స్టాలిన్ అంటున్నారు.












Click it and Unblock the Notifications