తండ్రి, త‌న‌యుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గ‌డువు స‌మీపిస్తోన్న కొద్దీ అక్క‌డి వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల పంప‌కాల్లో ఆయా పార్టీల అగ్ర‌నేత‌లు తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను రూపొందించుకుంటోన్నాయి.

ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.

Stalin to Contest from Kolathur and Udhayanidhi to Fight from Chepauk Thiruvallikeni as DMK 1st List

ఈ ప‌రిణామాల మ‌ధ్య డీఎంకే సీట్ల సంఖ్య వెలువ‌డింది. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ కొలత్తూర్ నియోజకవర్గం నుంచి బ‌రిలో నిల్చోనున్నారు. ఆయ‌న త‌న‌యుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చెపాక్-తిరువల్లికేని నుంచి బ‌రిలో నిలిచారు. 2011 నుంచి కొలత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు నమోదు చేస్తూ వ‌స్తోన్నారు స్టాలిన్.

కరుణానిధి 1996 నుంచి మూడుసార్లు చెపాక్-ట్రిప్లికేన్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అక్క‌డి నుండే మ‌రోసారి పోటీలో నిలిచారు ఉద‌య‌నిధి స్టాలిన్. డీఎంకే తొలి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం రాజకీయ నాయకుడాయ‌న‌. 2021 అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ అరంగేట్రం చేశారు.

మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 164 సీట్లలో డీఎంకే త‌న అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌నుంది. మిగిలిన 70 నియోజ‌క‌వ‌ర్గాలను కాంగ్రెస్, ఎండీఎంకే, ఇత‌ర‌ మిత్రపక్షాలకు కేటాయించింది. ఈ కూటమికి డీఎంకే నాయకత్వం వహిస్తోంది. డీఎంకే ప్రకటించిన అభ్యర్థుల్లో 125 మంది గ్రాడ్యుయేట్లు, 7 మంది పీహెచ్‌డీలు, 17 మంది ఎంబీబీఎస్ డాక్ట‌ర్లు ఉన్నారు. మొత్తం 164 మంది అభ్యర్థుల్లో 60 కొత్త ముఖాలు కాగా 18 మంది మహిళలు ఉన్నారు.

అభ్యర్థుల ప్రకటనలో జాప్యంపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కూటమిలోని అందరినీ కలుపుకుపోవడానికి, వారి అభ్యర్థనలను సానుభూతితో పరిగణనలోకి తీసుకోవడానికి కొంత సమయం పట్టింద‌ని వివ‌రించారు. ఎన్నికల సన్నద్ధతపై తలెత్తిన విమర్శలను స్టాలిన్ తోసిపుచ్చారు. 2024 నుంచే తమ సిద్ధమవుతున్నామ‌ని, బూత్ ఏజెంట్ల జోనల్ సమావేశాలను, పలు పార్టీ సమావేశాలను నిర్వహించామ‌ని గుర్తు చేశారు. మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేస్తానని స్టాలిన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+