రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. స్పృహ కోల్పోయిన మహిళలు, పలువురికి గాయాలు
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో ప్రయాణికులు తరలిరావడంతో ప్లాట్‌ఫాం నెంబర్ 14 , 15లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మరో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
#WATCH | Visuals from outside New Delhi Railway station.
— ANI (@ANI) February 15, 2025
There is no stampede. It is only a rumour. Northern Railways was running two planned special trains (for Prayagraj): CPRO Northern Railways pic.twitter.com/SHUvrnajip
స్పహ కోల్పోయిన మహిళలకు సీపీఆర్ చేసి సమీపంలోని ఆస్పత్రులకు తరలితంచారు. ఇతర గాయపడిన ప్రయాణికులను కూడా ఆస్పత్రులకు తరలితంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రావడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే, రైల్వే అధికారులు మాత్రం ఎలాంటి తొక్కిసలాట జరగలేదని చెబుతున్నారు.

టికెట్లు లేని ప్రయాణికులు ఒక్కసారిగా రావడమే ఇందుకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రైల్వే అధికారులు, ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌లు రై్ల్వే స్టేషన్ వద్దకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే స్టేషన్‌కు భారీగా పోలీసులు చేరుకున్నారు. టికెట్లు లేకుండా ప్రయాణికులు ఎలా వచ్చారో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Visuals from New Delhi railway station following a stampede this evening.
— Spotlight (@Spotlight_BBS) February 15, 2025
Railways have decided to run special Kumbh Mela trains after the incident.
DISTURBING VISUALS!
#NewDelhi #Stampede #KumbhMela2025 @OdishaRail pic.twitter.com/kMYEr5yCcp
50 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా మరో రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న మహా కుంభమేళా మొదలైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు త్రివేణి సంగమంలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర, సాంస్కృతిక సామాజిక కార్యక్రమం. ఇప్పటికే 50 కోట్లకుపైగా భక్తులు మహా కుంభమేళాల పుణ్యస్నానాలు చేశారని తెలిపింది. భారత్, చైనాలు మినహా మిగితా జనాభా కంటే ఈ సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే అని యూపీ ప్రభుత్వం పేర్కొంది. 144 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు మహా కుంభమేళాకు తరలివెళ్తున్నారు.












Click it and Unblock the Notifications