చిరు-నాగ్‌ల మాటీవీ, స్టార్ టీవీల మధ్య డీల్ రూ.2,500 కోట్లు?
హైదరాబాద్: మాటీవీ తెలుగు ఎంటర్టైన్‌మెంట్ చానెల్స్ ఇకపై స్టార్ టీవీ నెట్‌వర్క్‌లో భాగం కానున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున యజమానులుగా ఉన్న మా టెలివిజన్ నెట్‌వర్క్ లిమిటెడ్‌కు చెందిన బ్రాడ్‌కాస్టింగ్ వ్యాపారాన్నీ, బ్రాండ్, అసెట్స్‌తో సహా స్టార్ టీవీ ఏకమొత్తంగా కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెండు సంస్ధల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది.
మా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన నాలుగు చానళ్లు.... మాటీవీ, మా మ్యూజిక్, మా మూవీస్, మా గోల్ట్‌ను స్టార్ టీవీ గ్రూప్ సొంతం చేసుకుంటుంది. మా టెలివిజన్ నెట్‌వర్క్ లిమిటెడ్ కంపెనీ మాత్రం ప్రమోటర్ల చేతుల్లోనే ఉంటుంది. ఈ డీల్‌కు సంబంధించిన వివరాలను, నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, స్టార్ టీవీ సిఇఒ ఉదయ్ శంకర్ ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
డీల్ విలువను మాత్రం వారు వెల్లడించలేదు. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి డీల్‌ను పూర్తి చేయనున్నట్టుగా చెప్పారు. మా టెలివిజన్ నెట్‌వర్క్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌కు 65 శాతం వాటా ఉండగా చిరంజీవి కుటుంబానికి 20 శాతం, అక్కినేని నాగార్జునకు 10 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల చేతుల్లో 5 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ తన వ్యాపారాన్ని విక్రయిస్తున్నందున ఈ డీల్‌కు సంబంధించిన మొత్తం సొమ్ము మా టీవీ నెట్‌వర్క్ కంపెనీ ఖాతాల్లోకి వెళుతుంది.
అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. 2500 కోట్ల రూపాయలకు మాటీవీ, స్టార్ మధ్య డీల్ కుదిరినట్టుగా వార్తలు వస్తున్నాయి. దేశీయ మీడియా రంగంలో ఇది అతిపెద్ద డీల్‌గా భావిస్తున్నారు. సీరియల్ ఎంటర్‌ప్రీన్యూర్‌గా పేరున్న నిమ్మగడ్డ ప్రసాద్, బహుశ ఈ వాల్యుయేషన్ కారణంగానే చానెల్స్ విక్రయానికి సిద్ధపడి ఉంటారని అంటున్నారు.

మాటీవీ - స్టార్ టీవీ
మా టీవీని ఆరేడేళ్ల క్రితం తాము టేకోవర్ చేసినప్పుడు 170 మంది ఉద్యోగులుండగా ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య 500కు చేరిందని నిమ్మగడ్డ చెప్పారు.

మాటీవీ - స్టార్ టీవీ
ఒక వ్యాపారాన్ని టేకోవర్ చేసి, పెంచి, పోషించి ఒక స్థాయికి తీసుకువచ్చిన తర్వాత మరింత సమర్ధులైన వారికి విక్రయించడం వల్ల, సదురు వ్యాపారం మరింత ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.

మాటీవీ - స్టార్ టీవీ
టీవీ చానళ్లను విక్రయిస్తూ, కంపెనీని మాత్రం అట్టేపెట్టుకోవడంపై ప్రశ్నించగా, కంపెనీతో తమకున్న ఎమోషనల్ అటాచ్‌మెంట్ అందుకు కారణమని నిమ్మగడ్డ చెప్పారు. ఈ డీల్ పూర్తయిన తర్వాత కొత్తగా మళ్లీ ఏం చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మాటీవీ - స్టార్ టీవీ
తెలుగులో ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ప్రసారాల వ్యాపార విలువ 1800-2000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని స్టార్ సీఈవో ఉదయ్‌శంకర్ చెప్పారు. ఈ విభాగంలో మా టీవీ చానెళ్ల వాటా 27 శాతం ఉంది.. తెలుగులో ఉన్న అవకాశాలకు, ఇప్పుడున్న వృద్ధిరేటుకు మధ్య అంతరం ఉందనీ గట్టిగా ప్రయత్నిస్తే మరింత భారీ స్థాయిలో వృద్ధికి అవకాశం ఉందని స్టార్ టీవీ సీఈవో చెప్పారు. మా టీవీలో అక్కినేని నాగార్జున నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు యధావిధిగా కొనసాగుతుందని చెప్పారు. ఉద్యోగుల్లో కూడా ఎవరినీ తీసివేసే అవకాశం లేదని చెప్పారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications