Statue of Equality: రాహుల్ గాంధీ వంతు: చైనా విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించడమా?

న్యూఢిల్లీ: హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో గల త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్మించిన రామానుజాచార్యులవారి సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించడం పట్ల చెలరేగుతోన్న దుమారం తగ్గట్లేదు. రోజుకో కొత్త విమర్శలు వెలువడుతున్నాయి. ఇదివరకు తెలంగాణ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన ఈ కార్యక్రమం.. ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమౌతోంది. కర్ణాటకలోని ప్రకంపనలు సృష్టిస్తోన్న హిజబ్ వివాదం కూడా దీనికి తోడు కావడం- వివాదం తీవ్రతను పెంచినట్టయింది.

 మొన్న కేటీఆర్..

మొన్న కేటీఆర్..

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని హ్యాష్‌ట్యాగ్ చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇదివరకు వార్తల్లోకెక్కింది. సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాత వైఖరితో ఆవిష్కరించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సమానత్వాన్ని సాధించాలనే వేలాది ఆశలు, ఆశయాలు ఇప్పుడు మళ్లీ మరణించాయనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న అసమానత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.

సమానత్వం ఎక్కడ అంటూ..

సమానత్వం ఎక్కడ అంటూ..

తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రధాని పర్యటన నాడు బ్యానర్లను సైతం ప్రదర్శించిన విషయం తెలిసిందే. మతాల మధ్య చిచ్చుపెడుతూ, బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలను చిన్న చూపు చూస్తూ పరిపాలన సాగిస్తోన్ననరేంద్ర మోడీ చేతుల మీదుగా సమతా మూర్తి విగ్రహావిష్కరణకు నోచుకోవడం సరికాదంటూ తెలంగాణ మంత్రులు సైతం ధ్వజమెత్తారు. అసమానతలను ప్రోత్సహించే మోడీ సమాతమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడమా? అంటూ ధ్వజమెత్తారు.

ఇక రాహుల్ గాంధీ వంతు..

ఇదే విషయంపై విమర్శలను సంధించే వంతు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన ఈ వ్యవహారంపై విమర్శలు చేశారు. చైనాలో తయారైన సమతా మూర్తి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారని గుర్తు చేశారు. ప్రతి దానికీ ఆత్మనిర్భర్ అంటూ చెప్పుకొనే ఆయన- తన చేతులతో చైనాలో తయారైన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీనీ జాతికి అంకిత చేశారని వ్యాఖ్యానించారు.

Recommended Video

    Statue Of Equality : 108 Temples Surrounded At Ramanujacharya Statue | Oneindia Telugu
    చైనా నిర్భర్ భారత్..

    చైనా నిర్భర్ భారత్..

    ఈ పరిస్థితిని చూస్తోంటే- ఆయన కలలు గంటోన్న సరికొత్త భారత్.. చైనాపై ఆధారపడినట్టు కనిస్తోందని అన్నారు. చైనా-నిర్భర్? అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని డిజైన్ చేసింది భారత్‌లోనే అయినా దాన్ని తయారు చేసింది మాత్రం చైనా. 216 అడుగుల ఈ భారీ విగ్రహ నిర్మాణాన్ని ఓ చైనా కంపెనీ రూపొందించింది. గుజరాత్‌లో నర్మదా నదీ తీరాన ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం కూడా అక్కడ తయారైనదే. అందుకే- ఈ పాయింట్ ఆధారంగా రాహుల్ గాంధీ తాజాగా నరేంద్ర మోడీపై ఘాటు విమర్శలు సంధించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+