కొన్నేళ్లు పోతే ఎఫైర్ తప్పదు.. అదేదో నాతోనే 'సెక్స్' చేస్తే: కూతురితో నీచపు తండ్రి
గోడపై వీరి రాతలను చూసిన ఓ స్థానికుడు.. చైల్డ్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
భోపాల్: రక్షణగా ఉండాల్సిన తండ్రే బిడ్డలను లైంగికంగా వేధిస్తే.. పరిస్థితేంటి? చెప్పుకోవడానికి తల్లి కూడా లేకపోతే.. చెప్పినా పట్టించుకోని బంధువులుంటే.. వారి వేదన అరణ్య రోదనే అవుతుంది.
మధ్యప్రదేశ్ లోని దేవాస్ పట్టణంలో 11, 9ఏళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు కొన్ని నెలల పాటు ఇలాంటి నరకాన్నే అనుభవించారు. తల్లి లేని ఆ ఆడపిల్లలను మారు తండ్రి లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.
11ఏళ్లున్న పెద్ద కుమార్తెను కోరిక తీర్చమంటూ వేధించసాగాడు. 'కొన్నేళ్లు పోతే.. ఎవరో ఒకరితో ఎలాగు సంబంధం పెట్టుకుంటావు..నాతో శృంగారం చేస్తే తప్పేంటి?'అని బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు.

తండ్రి బారి నుంచి కాపాడుకునేందుకు.. ఆ బాలిక ప్రతీ రోజు ఐదు జతల దుస్తులను ధరిస్తూ వస్తోంది. కొన్నిసార్లు ఇంటినుంచి పారిపోయినా.. చెల్లి కోసం మళ్లీ ఇంటికి వచ్చేది. బంధువులకు, తెలిసినవారికి చెప్పినా.. వారెవరూ పట్టించుకోలేదు.
దీంతో తమ ఇంటి బయట ఉన్న గోడపై తమ బాధను అక్షరాల రూపంలో రాసేవారు.'అమ్మా మమ్మల్ని ఎందుకు ఈ నరకంలో వదిలేశావు.. ఈ దుర్మాగుడ్ని అంతం చేసేందుకు మాకు శక్తి ఇవ్వు' అని ఏడ్చేవారు. పెంపుడు తండ్రికి చదువు రాకపోవడంతో.. ఆ రాతలను అతను అంతగా పట్టించుకోలేదు.
కానీ ఆ రాతలే ఇద్దరు చిన్నారులను సదరు దుర్మార్గపు తండ్రి చెర నుంచి రక్షించాయి. గోడపై వీరి రాతలను చూసిన ఓ స్థానికుడు.. చైల్డ్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. చైల్డ్ హెల్ప్ లైన్ వారు పోలీసులను తీసుకుని అక్కడికి వెళ్లారు.
అనంతరం పోలీసులు బాలికలను వేధింపులకు గురిచేస్తోన్న పెంపుడు తండ్రిని అరెస్టు చేశారు. బాలికలిద్దరిని సంక్షేమ హాస్టల్ లో చేర్పించి.. తండ్రి నుంచి ఎదురైన చెడు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications