హీరో కమల్ హాసన్ కు రాళ్లు, కోడిగుడ్లతో స్వాగతం, నిన్న చెప్పులు, ఆందోళనలో అభిమానులు!

చెన్నె: ప్రముఖ బహుబాష నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడులో జరుగుతున్న శాసన సభ ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభిమానులు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నాయకులు కమల్ హాసన్ ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. కొందరు రాళ్లు, కోడిగుడ్లతో కమల్ హాసన్ కు స్వాగతం పలుకుతున్నారు.

తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో హీరో కమల్ హాసన్ కు నిరసనలతో స్వాగతం పలుకుతున్నారు. తమిళనాడులోని కరూర్ జిల్లా అరవకురుచిలో గురువారం రాత్రి హీరో కమల్ హాసన్ రోడ్ షో నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల్లో గెలిపించాని కమల్ హాసన్ మనవి చేస్తున్న సమయంలో కొందరు కోడిగుడ్లు, రాళ్లు విసిరారు.

Stone and Egg range at kamal haasan campaign In Aravakurichi in Tamil Nadu

ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు, అభిమానులు కమల్ హాసన్ కు రక్షణగా నిలిచారు. ఆసందర్బంలో కమల్ హాసన్ మాట్లాడుతూ తాను చెప్పులు, రాళ్లు, కోడిగుడ్లుకు బయపడను అన్నారు. ప్రజలు తనవైపు ఉన్నారని, కచ్చితంగా తన పార్టి అభ్యర్థులు గెలుస్తారని కమల్ హాసన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

బుధవారం రాత్రి తిరుప్పగుండ్రం శాసన సభ నియోజక వర్గంలో ప్రచారం చేస్తున్న కమల్ హాసన్ మీద కొందరు చెప్పులు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఒక్క రోజు తరువాత కమల్ హాసన్ మీద రాళ్లు, కోడిగుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం మీద పదేపదే విమర్శలుచేస్తున్న కమల్ హాసన్ కు ఇలాంటి చేదుఅనుభవాలు ఎదురు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+