సొంతఇలాకాలో చేదు: నితీష్, అఖిలేష్‌లపై చెప్పు, రాళ్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేక పోతోందని నిరసనకారులు విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంత వరకు ఎవరిని గుర్తించలేదు. అనంతరం కుసుంపురలో మరో వ్యక్తి నితీష్ పైన చెప్పు విసిరారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నితీష్ కుమార్ గతంలో నలంద నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహించారు.
అఖిలేష్ పైన చెప్పు
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌పై ఓ యువకుడు చెప్పు విసిరాడు. సోమవారం కావినగర్ సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల సభలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అక్కడ ఏర్పాటు చేసిన సభలో అఖిలేష్ యాదవ్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒక్కసారిగా చెప్పు విసిరాడు. తన భూమిని ప్రభుత్వం అన్యాయంగా స్వాధీనం చేసుకుందని, దీనికి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వమే కారణమని ఆ యువకుడు ఆరోపించాడు. దీంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications