పెళ్లి వేడుక కోసం ముస్తాబు కానున్న రాష్ట్రపతి భవన్.. ఏంటా స్టోరీ ?

భారత రాష్ట్రపతి భవన్ పెళ్లి వేడుకకు సిద్ధం కాబోతుంది. వినడానికి షాకింగ్ గా ఉన్నా కూడా ఇది నిజం. దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం రాష్ట్రపతి భవన్.ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం రాష్ట్రపతి భవన్ లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇంతకీ రాష్ట్రపతి భవన్ లో పెళ్లి చేసుకోబోతున్న ఆ జంట ఎవరు ? అంతటి ప్రత్యేకమైన స్థలంలో పెళ్లి వేడుకకు ఎందుకు అనుమతి ఇచ్చారో.. మీకోసం ప్రత్యేకంగా...

ముందుగా ఈ వివాహ వేడుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబానికి చెందిన వారిది అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.అలాగని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులదీ కూడా కాదు. ఒక సాధారణ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పెళ్లి కోసం ఈ స్పెషల్ అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. పూనమ్ గుప్తాకు జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న అవ్నీష్ కుమార్‌తో పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరి 12న వీరిద్దరి వివాహం జరగనుంది.

story behind marriage in president bhavan

పూనమ్ గుప్తా ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ భద్రత విభాగంలో పీఎస్ఓ హోదాలో పని చేస్తున్నారు. విధుల్లో అత్యంత క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేస్తున్న పూనమ్ గుప్తాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు మార్లు ప్రశంసించారని సమాచారం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం సీఆర్పీఎఫ్‌ మహిళా దళానికి పూనమ్ సారథ్యం వహించారు. ఈ క్రమంలోనే పెళ్లి ఆహ్వానం అందించే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి వివాహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకోవాలని సూచించారట.

రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో వివాహ వేడుక నిర్వహించుకోవాలని చెప్పారట. దీంతో ఈ అరుదైన అవకాశాన్ని పూనమ్ గుప్తా, అవ్నీష్ కుమార్, వారి కుటుంబ సభ్యులు సంతోషంగా అంగీకరించారు. ఒక రాష్ట్రపతి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో దేశ చరిత్రలో మొదటి సారి రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి భాజా మోగనుంది. ఇక పూనమ్ గుప్తా గురించి చెప్పాలంటే.. ఆమె నవోదయ విద్యాలయంలో గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్వాలియర్‌లోని శివాజీ విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేశారు. 2018లో యూపీఎస్‌సీ సీఏపీఎఫ్ పరీక్షల్లో 81వ ర్యాంక్ సాధించి సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా చేరారు. ప్రెజెంట్ ఈ పెళ్లి విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందరో ప్రముఖులకు దక్కని అవకాశం.. తన విధుల్లో సిన్సియర్ గా డ్యూటీ చేసిన మహిళా ఆఫీసర్ కి దక్కడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+