కర్ణాటకలో వింత.. 25 వేళ్లతో శిశువు జననం..
ఇప్పటి వరకు ఆరు వేళ్లతో పుట్టిన పిల్లలను చూశాం. కానీ ఈ శిశువు మాత్రం ఏకంగా 25 వేళ్లతో జన్మించింది. ఈ అసాధారణమైన లక్షణాన్ని కలిగి ఉన్న ఆడ శిశువు కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో పుట్టింది. రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో ఓ మహిళకు వింత శిశువు జన్మించింది. రబకావి బన్‌హట్టి పట్టణంలోని సన్‌షైన్ ఆసుపత్రిలో ఓ మహిళ ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అయితే, ఆ చిన్నారి అందరి పిల్లలా కాకుండా కాస్త వింతగా ఉంది. ఆ చిన్నారి చేతికి 12 వేళ్లు, కాళ్లకు 13 వేళ్లతో పుట్టింది. దాంతో ఆ చిన్నారిని చూసేందుకు జనం ఆసుపత్రి ఎదుట ఎగబడుతున్నారు.
ఇక, ఈ వింత శిశువు జననంపై డాక్టర్‌ని ప్రశ్నించగా.. క్రోమోజోముల్లో అసమతుల్యత వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుందని, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా వస్తుంటాయని, ఆసుపత్రిలోని గైనకాలజిస్ట్ డాక్టర్ పార్వతి హిరేమత్ వివరించారు. అయితే, తల్లీపిల్లలు ఇద్దరికీ ఎలాంటి సమస్యలు లేవని, వారిద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్ వివరించారు. అయితే, ఆ చిన్నారిని చూసి ఆ కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువుకు భారతి అనే నామకరణం కూడా చేశారు. ఈ సందర్శంగా ఆ శిశువు తండ్రి తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.

పిల్లల కోసం తాము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నామని.. పెళ్లయిన చాలా సంవత్సరాలకు సంతానం కలుగకపోతే, తన భార్య కుందరిగి ఎన్నో పూజలు చేసింది. చివరకు సురగిరి హిల్స్ ఆలయంలో శ్రీ భువనేశ్వరీదేవి శక్తిపీఠం ఆలయంలో ఎన్నో పూజలు చేసిందని, ఆ అమ్మవారి అనుగ్రహంతోనే మాకు ఇలాంటి శిశువు జన్మించిందని ఆయన చెప్పారు. దేశంలో ఇలాంటి వింత ఘటనలు చాలానే జరుగుతున్నాయి. గతేడాది రాజస్థాన్ రాష్ట్రంలోని ఇలాంటి వింత ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ చిన్నారి పుట్టుకతోనే 26 వేళ్లతో జన్మించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పడు మరోసారి ఇలాంటి వింత ఘటన కర్ణాటకలో చూస్తున్నాం.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications