టాయిలెట్‌లో కుక్క,చిరుత... ఏడు గంటలు రెస్క్యూ ఆపరేషన్... చివరకు ఏం జరిగిందంటే...
కర్ణాటకలోని బిలినెళ్లి అనే గ్రామంలో గమ్మత్తయిన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి టాయిలెట్‌లో వీధి కుక్కతో పాటు చిరుతపులి కనిపించింది. ఉదయాన్నే టాయిలెట్‌కు వెళ్లేందుకు ఆ ఇంటి యజమానురాలు దాని తలుపు తెరవగా చిరుతను చూసి షాక్ తిన్నది. వెంటనే టాయిలెట్ తలుపుకు బోల్ట్ పెట్టేసి ఇంట్లోకి పరిగెత్తింది. ఆపై ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు,స్థానిక అధికారులకు సమాచారమిచ్చారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అధికారులు దాదాపు ఏడు గంటల పాటు శ్రమించగా.. టాయిలెట్ పైకప్పు మీదుగా దూకిన చిరుత అక్కడినుంచి తప్పించుకుంది.
అసలేం జరిగింది...
స్థానికుల కథనం ప్రకారం... బుధవారం తెల్లవారుజామున బిలినెళ్లి గ్రామంలో సంచరిస్తున్న ఓ వీధి కుక్క చిరుత పులి కంటపడింది. చిరుత ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు గానీ దాన్ని చూడగానే ఆ కుక్క పరుగు అందుకుంది. ఈ క్రమంలో గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలోకి చొరబడింది. అయితే ఆ చిరుత కూడా కుక్కను వెంబడిస్తూ వెళ్లి అదే టాయిలెట్‌లోకి చొరబడింది. సరిగ్గా ఉదయం 7గంటల సమయంలో ఆ ఇంటి యజమానురాలు టాయిలెట్ వెళ్లేందుకు వచ్చి తలుపు తెరిచింది. అంతే... అక్కడున్న చిరుతను చూసి జడుసుకుంది. వెంటనే తలుపు పెట్టేసి ఇంట్లోకి పరిగెత్తింది.

అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ కుక్క...
ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పడం,వారు పోలీసులు,అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగాయి. ఉదయం 8.45గం. సమయంలో పోలీసులు,అధికారులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ట్రాన్‌క్విలైజర్ గన్‌తో ఆ పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకునేందుకు యత్నించారు. ఇందుకోసం ఆ మరుగుదొడ్డి పైకప్పును తొలగించారు. కానీ చిరుత మాత్రం పట్టుబడలేదు. ఆ పైకప్పు గోడల మీదుగా బయటకు దూకిన చిరుత అక్కడినుంచి తప్పించుకుంది. చిరుత ఎక్కడ తనను చంపేస్తుందోనని దాదాపు 7గంటల పాటు బిక్కచచ్చిపోయిన ఆ కుక్క అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది.
Recommended Video

సోషల్ మీడియాలో వైరల్...
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరుత రెస్క్యూ ఆపరేషన్ గురించి తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. చిరుత తప్పించుకునే సమయంలో తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. ఆపై వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో జనం భారీగా గుమిగూడటంతో వారిని నియంత్రించడం పోలీసులకు కూడా కష్టంగా మారింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications