Student: కాలేజ్ అమ్మాయికి కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేసిన వన్ సైడ్ లవర్ !

చెన్నై/ తిరుచ్చి: కాలేజ్ లో చదువుతున్న యువతి మీద ఓ యువకుడి కన్నుపడింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆమె వెంట ఆ యువకుడు తెగతిరిగేశాడు. అయితే కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి మాత్రం ఆ యువకుడి ప్రేమను అంగీకరించలేదు. ప్రేమను వ్యతిరేకించిన యువతి అదే విషయంలో తన ప్రాణం పోతుందని ఆమె ఊహించలేకపోయింది.

తనను ప్రేమించని యువతి ఈ భూమి మీద ఉండకూడదని, మరెవ్వరిని ప్రేమించకూడదని, పెళ్లి చేసుకోకూడదని రగిలిపోయిన కిరాతకుడు అతని స్నేహితులతో కలిసి ఆమెకు బలవంతంగా విషం తాగించే చంపేయడం కలకం రేపింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని తిరువెరుంబూరు సమీపంలోని నోచ్చివాయల్ కు చెందిన విద్యాలక్ష్మీ (19) అనే యువతి తిరుచ్చి జిల్లాలోని తువక్కుడి మణియమైలోని తాతయ్య ఇంట్లో నివాసం ఉంటూ ప్రైవేట్ కాలేజ్ లో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది.

Student: College girl murdered by gave poisoning in Trichy in Tamil Nadu.

తువకూడి ప్రాంతంలో నివాసం ఉంటున్న కిషోర్ (19) అనే యువకుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని విద్యాలక్ష్మి వెంటపడ్డాడు. అయితే కిషోర్ ప్రేమను నిరాకరించిన విద్యాలక్ష్మి ఆమె కాలేజ్ కు వెళ్లి చదువుకుని ఇంటికి వెళ్లిపోతుంది. విద్యాలక్ష్మి తనను ప్రేమించడం లేదని కిషసోర్ రగిలిపోయాడు.

మే 11వ తేదీన కాలేజ్ లో క్లాసులు ముగించుకున్న విద్యాలక్ష్మి ఇంటికి బయలుదేరింది. బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ తెలుతున్న విద్యాలక్ష్మిని బలవంతంగా పక్కకు లాక్కొని వెళ్లిన కిషోర్, అతని స్నేహితుడు కరణ్ మరో వ్యక్తి ఆమె మీద దాడి చేశారు. తరువాత కిషోర్, కరణ్ అతని స్నేహితుడు విద్యాలక్ష్మితో బలవంతంగా విషం కలిపిన కూల్ డ్రింక్ తాగించడంతో ఆమె ప్రాణాలు పోయాయి. ఇదే కేసులో కిషోర్ తో పాటు కరణ్ ను అరెస్టు చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+