రేవ్ పార్టీ, అసభ్యకరంగా: 46 మందిలో 20 మంది గర్ల్స్
పుణే: పుట్టిన రోజు వేడుకల పేరుతో రేవ్ పార్టీతో రెచ్చిపోయిన 46 మంది కాలేజ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన వారిలో ఇరవై మంది కాలేజ్ గర్ల్స్ ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో గురువారం జరిగింది. పుణేలోని లోనవాలా ప్రాంతం రేవ్ పార్టీలకు అడ్డాగా మారిపోయింది.
ఇదే ప్రాంతంలోని ఓ భవంతిలో రేవ్ పార్టీ పేరుతో ముంబై కళాశాలలో చదువుతున్న 46 మంది యువకులు, అమ్మాయిలు మందేసి, చిందేశారు.

రేవ్ పార్టీ
సమాచారం అందుకున్న పోలీసులు లోనవాల ప్రాంతంలోని రేవ్ పార్టీ పైన రైడ్ చేశారు. నలభై ఆరు మంది మందు మత్తులో తూగుతూ.. అసభ్యకర రీతి డ్యాన్సులు చేస్తూ ఉండటాన్ని గుర్తించారు. డ్యాన్సులకు అనుగుణంగా పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టుకున్నారు.

రేవ్ పార్టీ
వారు అల్కాహాల్, హుక్కా తీసుకున్నట్లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేశారు. కాలేజ్ విద్యార్థులతో పాటు బంగ్లా యజమానిని, కేర్ టేకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

రేవ్ పార్టీ
పోలీసులు రూ.19వేల హుక్కా, ఫారెన్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన విద్యార్థులు అందరూ 20 నుండి 23 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారు.

రేవ్ పార్టీ
వారి పైన ఐపిసి 294, 110, 112, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యార్థులను వైద్య పరీక్షల నిమిత్తం ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని కోర్టు ముందు ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications