మెడికో లవర్స్‌ని కిడ్నాప్ చేసి, బ్లూఫిలిం తీసి..: అరెస్టు

అదే కారులో బంధించి ఎవరూ లేని ప్రదేశంలోని ఓ మారుమూల ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరినీ సెక్స్‌లో పాల్గొనాల్సిందిగా బెదిరించారు. అందుకు నిరాకరిస్తే ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తామని బెదిరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ జంట సెక్స్‌లో పాల్గొనగా ఆ దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించారు. తమకు 25 లక్షలు రూపాయలు ఇవ్వాలని, లేకుంటే ఆ దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో పెడతామని, వారి తల్లిదండ్రులకు, కాలేజీ ప్రిన్సిపాల్‌కు వీడియోలు పంపుతామని బెదిరించారు.
దీంతో వారు 3 లక్షలు రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకోగా విద్యార్థినిని శుక్రవారం విడుదల చేశారు. డబ్బులు తీసుకురాకపోయినా, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా ఆ అబ్బాయిని చంపేస్తామని హెచ్చరించారు. కానీ, బాధిత విద్యార్థిని ధైర్యంగా వ్యవహరించి ఒక న్యాయవాది ద్వారా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమె చేతికి 3 లక్షల రూపాయలు ఇచ్చి శనివారం తెల్లవారుజామున దుండగులు తెమ్మన్న చోటికి పంపారు. డబ్బు కోసం వారు అక్కడికి రాగానే పోలీసులు దాడి చేశారు.
నిందితులు ఎదురుదాడికి దిగినప్పటికీ పోలీసులు పెద్ద ఎత్తున మఫ్టీలో ఉండటంతో 8మంది దొరికిపోయారు. పోలీసులు వారి నుంచి ఆయుధాలు, ఎటిఎం కార్డులు, సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ముగ్గురు రౌడీ షీటర్లు ఉన్నట్టు తెలిపారు.
అరెస్టు చేసిన ఎనిమిది మంది నిందితులు శంషుద్దీన్ (23), షమీర్ (21), ఇక్బాల్ (23), రవూఫ్ (22), నవాజ్ (28), నిసార్ (18), అర్షద్ (28), షర్ఫాన్ హుస్సేన్ (21)లను కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గొంతు కోసి హత్య చేయబోయిన అభయ్‌మోండాల్ (27) అనే యువకుణ్ని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications