సీఎం కేసీఆర్ పరామర్శ, స్కూల్ యాజమాన్యం పరారీ

మెదక్/హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద గురువారం ఉదయం జరిగిన పాఠశాల బస్సు ప్రమాదంలో గాయపడిన చిన్నారులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చందర్శేఖర రావు పరామర్శించారు. సికింద్రాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చిన్నారులకయ్యే వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణం రైల్వే శాఖదే అన్నారు. రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదమన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదం పైన విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

వారంలో గేట్లు: రైల్వే జీఎం

students killed as train rams bus in Medak

తెలంగాణ రాష్ట్రంలో వారంలోగా గేట్లు లేని అన్ని చోట్ల గేట్లను ఏర్పాటు చేస్తామని జీఎం ప్రకటించారు. పట్టాల పైన పడ్డ బస్సును అధికారులు క్రేన్ సాయంతో తొలగిస్తున్నారు.

పాఠశాల యాజమాన్యం పరారీ

ప్రమాదం నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం పాఠశాలకు తాళం వేసి పరారయింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 36 మంది ఉన్నారని తెలుస్తోంది. అందులో డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. మిగిలిన వారు చిన్నారులు. మొత్తం 19 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. వారు చింత సుమన్, గొల్ల మహేష్, విద్య, నీరుడు వంశీ, చింతల చరణ్, చింతల దివ్య, రజియా, వహీద్, భువన, వరుణ్, శృతి, తుమ్మ విష్ణు, భిక్షపతి, గణేష్ గౌడ్‌లు ఉన్నారు. చనిపోయిన వారిలో డ్రైవర్ కూడా ఉన్నాడు. డ్రైవర్ రెండు రోజుల క్రితమే విధుల్లో చేరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+