రెండు జడలు వేసుకోలేదని 200 గుంజీళ్లు తీయించారు.. ఎక్కడంటే..
రెండు జడలు వేసుకోకుండా వచ్చినందుకు ఓ చిన్నారికి స్కూలు ప్రిన్సిపల్ 200 గుంజీళ్ల శిక్ష విధించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
అహ్మదాబాద్: స్కూలు నిబంధనల ప్రకారం రెండు జడలు వేసుకోకుండా వచ్చినందుకు ఓ చిన్నారికి స్కూలు ప్రిన్సిపల్ 200 గుంజీళ్ల శిక్ష విధించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
మణినగర్‌లోని లలిత గ్రీన్‌లాన్స్ స్కూల్లో హనీ ప్రజాపతి(10) ఐదో తరగతి చదువుతోంది. తల మీద గడ్డ రావడంతో రెండు జడలు వేసుకోలేక పోనీ టెయిల్ వేసుకుని బడికి వచ్చింది.

దీనిపై క్లాస్ టీచరు అభ్యంతరం చెప్పి ఆ చిన్నారిని ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకువెళ్లింది. టీచర్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. పాప చెప్పేది వినిపించుకోకుండా ప్రిన్సిపల్ ఆ చిన్నారితో 200 గుంజీళ్లు తీయించారు.
కాళ్ల వాపులతో ఏడుస్తూ ఇంటికి వచ్చిన హనీని చూసి ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. హనీ తండ్రి ప్రవీణ్ ప్రజాపతి ఓ టీస్టాల్ ఓనర్. జరిగినదంతా హనీ చెప్పడంతో ఆయన ఆగ్రహంతో స్కూలు యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications