యోగి డౌన్.. డౌన్!: సీఎంకు చేదు అనుభవం.. కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులు

యోగి పాలనలో ముస్లింలకు, దళితులకు రక్షణ కరువైందని, వారిపై హింస పెరిగిపోతోందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విద్యార్థులు సీఎం కాన్వాయ్ ను చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు విద్యార్థుల సెగ తగిలింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి లక్నో యూనివర్సిటీకి వెళ్లిన ఆయన్ను విద్యార్థులు చుట్టుముట్టారు. కాన్వాయ్‌ను అడ్డుకుని పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

యోగి పాలనలో ముస్లింలకు, దళితులకు రక్షణ కరువైందని, వారిపై హింస పెరిగిపోతోందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విద్యార్థులు సీఎం కాన్వాయ్‌ను చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయంత్రం 5.15గం.కు జరిగిన ఈ ఆందోళనలో లెఫ్ట్ విద్యార్థి సంఘాలు, ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్స్, సమాజ్ వాదీ పార్టీ విద్యార్థి విభాగం సహా మరికొన్ని సంఘాలు పాల్గొన్నాయి.

Students shout slogans at CM Adityanath after halting motorcade, cops suspended

ఆందోళనలో పాల్గొన్నవారిలో 14మందిని పోలీసులు అరెస్టు చేయగా.. ఇందులో 4మహిళలు కూడా ఉండటం గమనార్హం. భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక సబ్-ఇన్ స్పెక్టర్, ఆరుగురు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. దళితులు, ముస్లింలపై దాడులతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

కాగా, ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో దళితులపై వరుస దాడులు జరగుతుండటంతో సీఎం యోగిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల మే 5వ తేదీన షహరన్ పూర్ లో దళితులపై ఠాకూర్ ల దాడితో ఆ ప్రాంతం అట్టుడికింది. ఎప్పుడు ఎవరి మీద ఎవరు దాడి చేసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఠాకూర్ ల దాడిలో 50మంది దళితుల ఇల్లు కాలి బూడిదైపోయాయి.

షహరన్ పూర్ జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 40శాతం ముస్లిం జనాభా కాగా, మరో 22శాతం దళిత సామాజిక వర్గం ఉన్నారు. మిగతా కులాలకు, వీరికి నడుమ ఎప్పుడూ ఏదో వివాదం రగులుతూనే ఉంది. 2010-2016మధ్యలో ఇక్కడి అగ్ర వర్ణాలకు, దళిత ముస్లిం సామాజిక వర్గాలకు మధ్య 544సార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2016తర్వాత ఆ గొడవలు పెరిగిపోతూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+