జల్లికట్టు నిరసనలతో హోరెత్తుతున్న తమిళనాడు: వెనక్కి తగ్గమంటున్నారు..

ప్రజలు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు.. ఇలా తమిళ జాతి మొత్తం ఇప్పుడు జల్లికట్టుపై తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నాయి.

న్యూఢిల్లీ: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కనుమ రోజు జల్లికట్టు క్రీడ నిర్వహించడం తమిళుల సాంప్రదాయం. అయితే ఈ క్రీడ ద్వారా మూగజీవాలను హింసకు గురవుతున్నాయన్న కారణంగా 2014లో సుప్రీం కోర్టు దీన్ని నిషేధించింది.

జల్లికట్టు క్రీడకు సుప్రీం 'నో' చెప్పినప్పటినుంచి.. అనాదిగా వస్తున్న తమ ఆచారంపై నిషేధం ఎత్తివేయాలని తమిళులంతా పట్టుబడుతూనే ఉన్నారు. ప్రజలు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు.. ఇలా తమిళ జాతి మొత్తం ఇప్పుడు జల్లికట్టుపై తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నాయి.

ఓ ఉద్యమ తరహాలో

ఓ ఉద్యమ తరహాలో

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడం కోసం తమిళులంతా ఓ ఉద్యమం దిశగా కదులుతున్నారనే చెప్పాలి. ఆయా రంగాలకు అతీతంగా తమిళులంతా 'జల్లికట్టు'పై ఒక్కతాటికి వచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి.

ఈ విషయంపై స్పందించిన సినీ హీరో శింబు.. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయకుంటే.. తాను దేశం విడిచిపోతానని చెప్పిన సంగతి తెలిసిందే. తమిళ సాంప్రదాయమైన జల్లికట్టు కోసం ప్రజానీకమంతా ఒక్క తాటిపైకి రావాలని శింబు ఆకాంక్షించారు.

కలెక్టరేట్ల వద్ద నిరసనలు:

కలెక్టరేట్ల వద్ద నిరసనలు:

జల్లికట్టు క్రీడకు సుప్రీం ససేమిరా అనడంతో తమిళ ప్రజలంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మదురై, కోయంబత్తూరు సహా పలుచోట్ల కలెక్టరేట్ల వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. జల్లికట్టుకు మద్దతుగా నినాదాలు చేశారు.

మధురైలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు.. కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం కోసం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వినతిపత్రానికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసుల లాఠీచార్జి:

పోలీసుల లాఠీచార్జి:

మధురై కలెక్టరేట్ వద్ద విద్యార్థుల నిరసన పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడంతో.. లోపలికి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేసి విద్యార్థులను చెదరగొట్టారు.

ఇది మా సాంప్రదాయ క్రీడ:

ఇది మా సాంప్రదాయ క్రీడ:

జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించాలంటూ ఓ న్యాయ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తమ సాంప్రదాయ క్రీడ అని, దీన్ని నిషేధించాల్సిన అవసరమేంటని ప్రశ్నించాడు. జల్లికట్టును సాంప్రదాయ క్రీడగానే చూడాలి తప్ప అపార్థం చేసుకోవద్దని అన్నాడు.

కాగా, కోయంబత్తూర్ కలెక్టరేట్ వద్ద అక్కడి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు:

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు:

తమిళుల సంస్కృతి-సాంప్రదాయంలో జల్లికట్టుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో వివరిస్తూ అధికార అన్నా డీఎంకే, విపక్ష డీఎంకే పార్టీలు ప్రకటనలు విడుదల చేశాయి. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేత విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని ప్రకటనల ద్వారా కోరాయి.

ఇదే విషయంపై మాట్లాడుతూ.. జల్లికట్టు నిర్వహించేందుకు అనుమతులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శుక్రవారం నాడు అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

సుప్రీం కోర్టు తీర్పు దురదృష్టకరం:

సుప్రీం కోర్టు తీర్పు దురదృష్టకరం:

జల్లికట్టుపై సుప్రీం కోర్టు తీర్పు దురదృష్టకరమన్నారు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి.సరస్వతి. నిషేధం ఎత్తివేయడం కోసం ప్రభుత్వం తరుపున అన్నివిధాలా కృషిచేస్తామని చేస్తామని అన్నారు.

తీర్పు త్వరగా కోరడంపై సుప్రీం ఆగ్రహం:

తీర్పు త్వరగా కోరడంపై సుప్రీం ఆగ్రహం:

జల్లికట్టుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టుపై పలువురు న్యాయవాదులు ఒత్తిడి తీసుకురావడం పట్ల సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులు ఇలా కోరడం సరైంది కాదని, తీర్పు ఎప్పుడు వెలువరించాలో తమకు తెలుసునని సుప్రీం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+