Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచ వ్యాప్తంగా అబ్బురపర్చిన తొలి పెనుంబ్రల్ చంద్రగ్రహణం దృశ్యాలు

న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో మొదటి పెనుంబ్రల్ చంద్రగ్రహణం(Penumbral Lunar Eclipse)ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తిలకించారు. శుక్రవారం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చంద్రుడు రక్తం ఎరుపు రంగులో కనిపించాడు. మళ్లీ సెప్టెంబర్ 2042 వరకు మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు ఆసక్తిగా వీక్షించారు.

ఆకాశంలో రక్తంతో తడిసినట్లుగా చంద్రుడు కళ్లకు కనిపించాడు. అయితే, చంద్రగ్రహణాల దృశ్యమానత, సమయం మీ స్థానం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి మారిపోయి ఉండవచ్చు. సోషల్ మీడియా కూడా ప్రకాశవంతమైన, ఎర్రటి చంద్రుని చిత్రాలు, టైమ్-లాప్స్ వీడియోలతో నిండిపోయింది.

 stunning photos of first Penumbral Lunar Eclipse 2023 across world

అరుదైన ఖగోళ సంఘటనలలో ఒకటైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం దేశంలోని పలు ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా కనిపించింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ప్రకారం.. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాల నుంచి పెనుంబ్రల్ చంద్రగ్రహణం కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ, హైదరాబాద్‌తో సహా అన్ని ప్రధాన భారతీయ నగరాలు ఈ ఖగోళ దృగ్విషయానికి సాక్ష్యమిచ్చాయి.

అయితే, పెనుంబ్రల్ చంద్రగ్రహణం కంటితో కనిపించకపోవడంతో... ఈ ఖగోళ సంఘటనను గమనించడానికి టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌లు ఉపయోగించుకున్నారు వీక్షకులు.

న్యూఢిల్లీ: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
ముంబై: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
గురుగ్రామ్: 8:44 pm (మే 5) నుంచి 1:01 am (మే 6)
హైదరాబాద్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)

బెంగళూరు: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
చెన్నై: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
కోల్‌కతా: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
భోపాల్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
చండీగఢ్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
పాట్నా: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
అహ్మదాబాద్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)

విశాఖపట్నం: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)

గౌహతి: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
రాంచీ: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
ఇంఫాల్: 8:44 pm (మే 5) నుంచి 1:01 am (మే 6)
ఇటానగర్: రాత్రి 8:44 (మే 5) నుంచి ఉదయం 1:01 వరకు (మే 6)
మే 5 రాత్రి 10:52 గంటలకు గరిష్ట పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడింది.

ఈ సమయాల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌లను ఉపయోగించి చంద్రగ్రహణంను వీక్షించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+