సరదా కాస్తా విషాదంగా మారింది: రైలుకు వేలాడుతూ.. (వీడియో)

బెంగళూరు: ప్రమాదమని తెలిసినా కూడా నేటి యువత వింత వింత విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. కదులుతున్న రైల్లోంచి వేలాడుతూ విన్యాసం చేసి ఓ యువకుడు రైలు నుంచి కింద పడ్డాడు. దాన్ని మరికొంతమంది వీడియో తీయడం, సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా.. ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయింది.

బెంగళూరుకు సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. అతను రైలు కిటికీ కడ్డీలు పట్టుకొని వేలాడుతున్నప్పుడు రైలు లోపల ఉన్న కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

Stunt gone wrong: Video of youth hanging from train sparks rage online.

ఆ విన్యాసం చేసిన యువకుడు రైలు నుంచి కిందపడ్డాడు. వీడియోలో ఆ యువకుడు కిటికీ కడ్డీలను పట్టుకొని ఊగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రైలు నుంచి కంకరరాళ్లలో పడిన ఆ యువకుడికి ఏమైందో తెలియాల్సి ఉంది.

అయితే ప్రమాదకర స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని లోపలికి లాగాల్సిందిపోయి వీడియో తీయడమేంటని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. యువకుడిని రక్షించేందుకు అత్యవసర గొలుసు లాగి అతడ్ని కాపాడాల్సి ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, తరచూ ఎన్నో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటిలో ఎక్కువ శాతం యువత తమ ప్రాణాలను పోగొట్టుకున్న ఘటనలే ఉన్నాయి. వీళ్లు చేసే విన్యాసాల్లో వారి ప్రాణం పోతే వారి కన్నతల్లిదండ్రులకు మిగిలేదీ అంతులేని వేదన తప్ప మరోటి కాదని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+