స్టైలిష్ ‌ఔట్‌ఫిట్స్: మెలానియా, ఇవాంకా వస్త్రధారణపై నెటిజన్ల నజర్: నెట్టింట్లో జోరుగా చర్చ

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిద్దరే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా నిలిచారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా విమానం దిగారో.. లేదో.. ఆ వెంటనే మెలానియా, ఇవాంకాలపై వస్త్రధారణపై చర్చ మొదలైంది. జోరుగా సాగుతోంది నెటిజన్ల మధ్య. మెమెస్ కూడా తయారయ్యాయి.

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్ దంపతుల కంటే ముందుగా ఇవాంకా, ఆమె సోదరుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ విమానం నుంచి కిందికి దిగారు. ఎరుపురంగు డిజైన్‌ను ముద్రించిన హాఫ్ స్లీవ్డ్ షర్ట్‌‌ను ధరించారు. విమానాశ్రయంలో అధికారులతో పరిచయ కార్యక్రమం సందర్భంగా ఆమె చిరునవ్వుతో అందర్నీ పలకరించారు. వారికి షేక్ హాండ్ ఇస్తూ చలాకీగా కనిపించారు.

Stylish Outfits: Melania, Ivanka Trump Exude Elegance With Subtle Yet Outfits

వారు కిందికి కొద్ది నిమిషాల తరువాత ట్రంప్ తన భార్యతో కలిసి విమానం నుంచి కిందికి దిగారు. ఈ సమయంలో తన కుమార్తె ఇవాంకా ట్రంప్‌కు పూర్తి భిన్నమైన వస్త్రధారణలో కనిపించారు మెలానియా. తెలుగు, బూడిదరంగు మిశ్రమంతో కూడిన ఫుల్ స్లీవ్డ్, వైడ్ లెగ్గ్‌డ్ ప్యాంట్‌ను ధరించి కనిపించారు. అధికారిక పర్యటనకు వచ్చిన మెలానియా, ఇవాంకా ట్రంప్.. ఇద్దరూ సింపుల్‌గా వస్త్రధారణ చేసుకోవడం నెటిజన్లను ఆకట్టుకున్నట్టుంది.

అందుకే వారిని తెగ మెచ్చుకుంటున్నారు. అధికారిక దర్పం ప్రదర్శించేలా వారి వస్త్రధారణే కాదు.. నడవడిక కూడా లేదని ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి ఫస్ట్ లేడీగా ఉంటూ చాలా సాదాసీదాగా, కలుపుగోలుగా ఉండటం వారి మనస్తత్వానికి అద్దం పడుతోందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, ఇవాంకా ప్రయాణిస్తోన్న కాన్వాయ్ మొతేరా స్టేడియానికి చేరుకున్న తరువాత అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఇవాంకాతో సెల్పీ దిగడానికి పోటీ పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+