సబ్ఇన్‌స్పెక్టర్ పోస్టులు: సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్
సబ్ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
సబ్ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి28, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు : అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్
విద్యార్హత : ఇంటర్మీడియట్, +క్లాస్
ఉద్యోగ ప్రాంతం : ఇండియా వ్యాప్తంగా
చివరి తేదీ : ఫిబ్రవరి28, 2017

మొత్తం పోస్టులు : 79
పరిమిత వయసు : ఫిబ్రవరి28, 2017 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 10నిమిషాల డిక్టేషన్, నిమిషానికి 80పదాల స్పీడుతో టైపింగ్, ట్రాన్స్ స్క్రిప్షన్ ఇంగ్లీష్ లో 50నిమిషాలు, హిందీలో 65నిమిషాల్లో కంప్యూటర్ పై చేయగలిగాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం : నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును సరైన వివరాలతో నింపి సంబంధిత డాక్యుమెంట్స్ తో పాటు మూడు 'స్వయం చిరునామా' తెలిపే ఎన్వలప్స్(12X27cm)కు రెండు ఫోటోలను జత చేసి జోనల్ డీఐజీ, సీఐఎస్ఎఫ్ ఆఫీస్ చిరునామాకు ఫిబ్రవరి 27, 2017లోపు పంపించాలి.
మరిన్ని వివరాలకు : https://goo.gl/2C2VBF












Click it and Unblock the Notifications