తొలిసారి: వాట్సప్ ద్వారా రాజీనామా పంపిన ఎస్ఐ

కాన్పూర్: తొలిసారి ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఐ) వాట్సాప్‌ ద్వారా తన రాజీనామా పంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌ దెహత్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దేహత్‌ జిల్లాకు చెందిన ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ తనపై అధికారుల వేధింపులు, అవమానాలు తాళలేక ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించే హెల్ప్‌లైన్‌ నెంబర్‌కి వాట్సాప్‌ ద్వారా రాజీనామా లేఖ పంపించాడు.

కాగా, ఆ రాజీనామాను పై అధికారులకు ఫార్వర్డ్‌ చేశారు. ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేపట్టి, 24గంటల్లో నివేదిక అందజేయాలని ఐజీ అశుతోష్‌ పాండే అధికారులను ఆదేశించారు. ఈ విధంగా రాజీనామా ఇప్పటి వరకు ఎవరూ పంపలేదని, ఇదే మొదటిసారని ఆయన తెలిపారు.

Sub-Inspector Sends Resignation Via Whatsapp in Kanpur

మంగళవారం రాత్రి అతను రాజీనామాను వాట్సప్ ద్వారా పంపాడని చెప్పారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను 9 జిల్లాల్లోని 176 పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాన్పూర్ జోన్‌లోకి వచ్చే ఔరేయా, ఈటాహ్, ఫరూఖాబాద్, కాన్పూర్, కాన్పూర్ దేహత్, కనూజ్, ఝాన్సీ, జలౌన్ జిల్లాల్లో ఈ హెల్ప్‌లైన్ ను ఏప్రిల్ 16న ప్రారంభించామని ఐజి పాండే తెలిపారు.

హెల్ప్‌లైన్ నెంబర్‌కు అనుసంధానంగా వాట్సప్ ఖాతాను కూడా తెరవడం జరిగిందని, ప్రజలు వారి ఫిర్యాదులను ఆడియో, వీడియో, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా పంపుతున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+