వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహం: హ్యాపీగా ఉందంటూ ప్రధాని నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. విగ్రహం సిద్ధమయ్యే వరకు బోస్ హోలోగ్రామ్‌ను ఆ ప్రదేశంలో ఉంచనున్నారు. హోలో గ్రామ్ అంటే కాంతి కిరణాల ద్వారా ఏర్పడే త్రీడీ చిత్రం.

కాగా, గతంలో ఇంగ్లాండ్ రాజు జార్జ్-V విగ్రహం ఉన్న స్థానంలోనే ఇప్పుడు చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. జార్జ్ విగ్రహాన్ని 1968లోనే అక్కడ్నుంచి తరలించారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నేతాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 Subhash Chandra Bose Statue to be installed at India Gate: PM Modi.

దేశమంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని జరుపుకుంటున్న తరుణంలో ఇండియా గేట్ వద్ద ఆయన గ్రానైట్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆయన రుణం తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం. నేతాజీ భారీ విగ్రహం పూర్తయ్యే వరకు ఆయన హోలోగ్రామ్ ను ఆ స్థానంలో ఉంచనున్నాం. జనవరి 23న దానిని ఆవిష్కరించనున్నాం అని ప్రధాని నరేంద్ర మోడీ వరుస ట్వీట్లతో వెల్లడించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని జనవరి 23 నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా అయితే జనవరి 24 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే భారత భద్రతా దళాలు విన్యాసాల రిహార్సల్స్ ప్రారంభించారు.

English summary
Subhash Chandra Bose Statue to be installed at India Gate: PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X