Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాటకిని జైలుకు పంపండి: సోనియాపై సుబ్రహణ్యస్వామి

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర స్థాయిలో ఆరోపిణలు గుప్పించారు. తాటకిని ఎందుకు తీహార్‌ జైలుకు ఎందుకు పంపించరూ అంటూ సుబ్రమణ్యస్వామి ఓ కోడ్‌‌ను ఉపయోగించి ట్విట్టర్‌‌లో ఓ సందేశాన్ని ట్వీట్‌ చేశారు.

తాటకి అంటూ పరోక్షంగా సుబ్రమణ్యం స్వామి కోడ్‌ భాషలో సోనియా గాంధీని ఉద్దేశించి ట్విట్‌ చేశారు. ‘ఎలాంటి పదవిలో లేకుండానే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో చాలా చేస్తున్నాను. అధికారంలో ఉండి టీడీకే (తాటకి)ని తీహార్‌ జైలుకు ఎందుకు పంపించరూ‘ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేగాక రాహుల్ గాంధీని బుద్ అంటే మూర్ఖుడు లేదా మూగవాడని, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్మక్షుడు అరవింద్ కేజ్రివాల్‌ని ‘శ్రీ 420' అని వ్యాఖ్యానించారు.

Subramanian Swamy fires at Sonia Gandhi

భారత మొట్టమొదటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రారంభించిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక సంబంధించిన నిధుల దుర్వినియోగం చేశారంటూ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై సుబ్రమణ్యస్వామి కేసు వేశారు. ఈకేసులో గురువారం సోనియాగాంధీ, రాహుల్‌‌లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై సుబ్రమణ్యం పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కోర్టుకు హాజరైతే సోనియా, రాహుల్‌ గాంధీలు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని.. అలాగే వారి పాస్‌ పోర్టులను కోర్టుకు దాఖలు చేయాల్సి ఉంటుందని మరో ట్వీట్‌‌లో వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+