76 విమానాలు.. 15,920 మంది తరలింపు: సింధియా
రష్యా దాడికి తెగబడటంతో ఉక్రెయిన్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను క్షేమంగా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 15,920 మంది భారతీయ విద్యార్థులను తీసుకొచ్చారు. ఇందుకోసం 76 విమానాలను ఉపయోగించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

రొమేనియా నుంచి 6680 మంది విద్యార్థులను 31 విమానాల ద్వారా, హంగేరీ నుంచి 5,300 మందిని 26 విమానాల ద్వారా, పోలాండ్ నుంచి 2,822 మందిని 13 విమానాల ద్వారా, స్లోవేకియా నుంచి 1,118 మందిని 6 విమానాల ద్వారా తరలించామని ట్వీట్ చేశారు. అలాగే ఉదయం చేసిన మరో ట్వీట్‌లో రొమేనియా సహాయాన్ని ఆయన కొనియాడారు. భారతీయ విద్యార్థులను తమ పిల్లల మాదిరిగా చూసుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత భారతీయ విద్యార్థులను విమానాల ద్వారా తరలింపు కోసం 'ఆపరేషన్ గంగా'ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో పొరుగు దేశాలైన రొమేనియా, పోలాండ్, హంగేరీ, స్లోవేకియా ద్వారా భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను విమానాల ద్వారా తరలిస్తున్నారు. ఈ తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయడం కోసం కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ ఉక్రెయిన్ పొరుగు దేశాలకు ఫిబ్రవరి 28న వెళ్లారు. జ్యోతిరాదిత్య సింధియాను రొమేనియాకు పంపారు.
ఇటు ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా మీడియా ముందు కంటతడి పెట్టాడు. అతని భార్య అంతకుముందు భావొద్వేగంతో మాట్లాడారు. రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య జెలెన్ స్కా మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు జరుగుతున్న అన్యాయంపై ప్రపంచ దేశాలు నోరు విప్పాలని కోరారు. ఇన్ స్టాగ్రామ్‌లో వివిధ దేశ అధినేతల సతీమణిలతో మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ కు ఎలాంటి సాయం చేయగలమని వారు అడుగుతున్నారని, ప్రపంచానికి నిజం చెప్పడమే వాళ్లు చేసే సాయమని జెలెన్ స్కా అన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications