జేడీఎస్ తర్వాత సీఎం సిద్ధరాయ్యను కలిసిన నటుడు సుదీప్: కర్ణాటకలో ఏం జరుగుతోంది?
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. సోమవారం మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధినేత కుమారస్వామిని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా, గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ప్రధానంగా, కన్నడ చలనచిత్ర కప్(కేసీసీ) క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్యను సుదీప్ కోరినట్లు తెలిసింది. అయితే, ఈ భేటీ సందర్భంగా సుదీప్.. సీఎంతో కొద్దిసేపు వివిధ అంశాల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, సుదీప్ దేవేగౌడ పార్టీ చేరతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఆయన సీఎంను కలవడం కన్నడలో సంచలనంగా మారింది. అయితే, నెల రోజుల క్రితం కూడా సుదీప్ సీఎంను కలిశారు.

ఇది ఇలావుంటే సుదీప్‌కు బళ్లారి లేదా చిత్రదుర్గా నియోజకవర్గ టికెట్ ఇచ్చేందుకు కూడా జేడీఎస్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, సుదీప్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా సుదీప్‌ను ఎన్నికల బరిలోకి దించాలని యత్నిస్తున్నట్లు తెలిసింది.
కుల ప్రాతిపదికన సుదీన్ ను రంగంలోకి దించాలని అనుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సినీనటులకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుండటం గమనార్హం. ఇప్పటి మరో ప్రముఖ నటుడు ఉపేంద్ర రాజకీయ పార్టీ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగోతంది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications