సుఖోయ్ - 30 యుద్ద విమానం విన్యాసాలు.. మీరూ ఓ లుక్కేయండి (వీడియో)
ఢిల్లీ : గగన తలంలో సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ద విమానం సందడి చేసింది. ఎయిర్ ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యుద్ధ విమానం విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గాల్లో ఎగురుతూ పలు రకాల ఫీట్లు చేసిన సుఖోయ్ 30 యుద్ద విమానానికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని హిందన్ వైమానిక స్థావరంలో.. ఎయిర్ మార్షల్ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియాకు సెల్యూట్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించినట్లు సమాచారం.
భారత వైమానిక దళం 87వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఎయిర్ ఫోర్స్ అధికారులు వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. హిందన్ స్థావరం కేంద్రంగా వివిధ రకాల యుద్ద విమానాలతో వైవిధ్య భరితమైన విన్యాసాలతో ప్రదర్శన నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు మరో రెండు రోజుల్లో గగన తలంలో ఈ విన్యాసాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఆ క్రమంలో గెట్ రెడీ అంటూ భారత వైమానిక దళం ట్వీట్ చేయడం విశేషం. అయితే దీనికి సంబంధించిన ప్రొమో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
#AFDay2019 : Promo video on the occasion of 87th Anniversary of Indian Air Force.
— Indian Air Force (@IAF_MCC) October 5, 2019
Watch the full video on : https://t.co/WyGyVrcXZy#AFDay19 pic.twitter.com/v2vlLA5Euh

మరో రెండు రోజుల్లో యుద్ద విమానాలు, రవాణా విమానాలు గాల్లో ఎగురుతూ సందడి చేయనున్నాయి. వింటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫైటర్ జెట్‌లు కూడా ప్రదర్శనలో భాగం కానున్నాయి. అంతేకాదు ఈ ప్రదర్శన సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ ఏరో బాటిక్ బృందంతో పాటు సారంగ్ హెలికాప్టర్ టీమ్ కనబరిచే అద్భుత సాహస విన్యాసాలు వీక్షకులను కట్టిపడేయనున్నాయి. సుఖోయ్ యుద్ద విమానం విన్యాసాలకు సంబంధించిన ఫుల్ వీడియో వీక్షించాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications