సీఎం మీద ఈసీకి ఫిర్యాదు చేసిన సుమలత, ఫ్యాన్ ట్యాపింగ్, ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ నిఘా!
బెంగళూరు: ముఖ్యమంత్రి కుమారస్వామి అధికార దుర్వినియోగంతో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, తన మీద కక్ష సాధిస్తున్నారని మండ్య లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, ప్రముఖ నటి సుమలత ఆరోపించారు.
ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అధికార దుర్వనియోగం చేస్తున్నారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని సుమలత ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మీద ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన సుమలత అనంతరం మీడియాతో మాట్లాడారు.

బెంగళూరులోని తన ఇంటి చుట్టుపక్కల ఇంటెలిజెన్స్ పోలీసులు సంచరిస్తున్నారని, ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి ముఖ్యమంత్రి కుమారస్వామికి సమాచారం ఇస్తున్నారని సుమలత ఆరోపించారు. తాను మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన తరువాత ఇంటెలిజెన్స్ పోలీసులు తన ఇంటి దగ్గర మకాం వేశారని సుమలత ఆరోపించారు.
మీరు జాగ్రత్తగా ఉండాలని, మీ మీద నిఘా వేశారని స్వయంగా జేడీఎస్ పార్టీకి చెందిన వారే తనను హెచ్చరించారని సుమలత అన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మీద చేసిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమీషన్ అధికారులు హామీ ఇచ్చారని సుమలత మీడియాకు చెప్పారు.
మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తన కుమారుడిని ఎంపీగా గెలిపించుకోవడానికి కుమారస్వామి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications