సమ్మర్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే.. అస్సలు మిస్ అవ్వకండి..!
ఎండాకాలం వచ్చేసింది. మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఏప్రిల్, మే లో ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో ఏప్రిల్ ప్రారంభం కానుంది. అయితే ఏప్రిల్ లో ఎండల నుంచి దూరంగా ప్రకృతికి దగ్గరగా వెళ్లాలని ఉందా..? అలా హాయిగా చల్లని ప్రదేశాల్లో విహరించాలని ఉందా..? అయితే మీకోసం బెస్ట్ ప్లేస్ ఎదురుచూస్తోంది. అదే గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళ.. ఈ వేసవిలో మంచి అనుభూతి పొందాలంటే కేరళ టూర్ వేయాల్సిందే.
అయితే వేసవిలో ఫ్యామిలీ మొత్తం టూర్ వేసేలా IRCTC ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కవ ధరకే 6 రోజులపాటు ఫుల్ ఎంజాయ్ చేసేలా ఈ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. IRCTC కేరళ టూర్ ను అతి తక్కువ ధరకే అందిస్తోంది. కేరళ హిల్స్ అండ్ వాటర్స్ అనే పేరుతో ఈ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 6 రోజుల ఈ జర్నీలో భాగంగా మున్నార్, అలెప్పీ ఇతర టూరిస్టు ప్రాంతాలను సందర్శించొచ్చు.
ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, తెనాలి రైల్వే స్టేషన్స్ లో టూర్ కు సంబంధించి బోర్డింగ్ పాయింట్ ఉంది. జర్నీ అనంతరం మళ్లీ అదే స్టాప్స్ లో దిగే అవకాశం ఉంది. ఇక జర్నీలో భాగంగా మొదటిరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు శబరి ఎక్స్ ప్రెస్ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ చేశాక మరుసటి రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆలువా రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

అక్కడి నుంచి మున్నార్ కు బయల్దేరుతారు. అక్కడే మున్నార్ లో టూరిస్ట్ ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రికి మున్నార్ లోనే స్టే ఉంటుంది. మరుసటిరోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ కు చేరుకుంటారు. అక్కడే టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ ఎకో పాయింట్ ను సందర్శిస్తారు. రాత్రికి మున్నార్ లోనే బస చేస్తారు. ఆ తర్వాతి రోజు అలెప్పీ సందర్శన ఉంటుంది. ఇక ఐదోరోజు ఎర్నాకులం బయల్దేరుతారు. అక్కడే ఉదయం 11 గంటల 15 నిమిషాలకు శబరి ఎక్స్ ప్రెస్ రైలు ఉంటుంది. అలా రాత్రంతా జర్నీ తర్వాత ఆరోరోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ పూర్తవుతుంది.












Click it and Unblock the Notifications