సన్ నెట్‌వర్క్‌ క్లియరెన్స్ ఇష్యూ: మూత పడనున్న జెమినీ ఛానల్స్..?

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సన్ నెట్‌వర్క్ ఇబ్బందుల్లో పడింది. కోర్టులు కల్పించుకుని హోం శాఖ నిర్ణయంపై స్టే విధించకుంటే సన్ నెట్‌వర్క్‌కు చెందిన మొత్తం 33 ఛానళ్లు మూతపడనున్నాయి.

సన్ నెట్ వర్క్‌కు చెందిన ఆ 33 ఛానళ్లు ఇవే. సన్ టీవి, సన్ టీవీ హెచ్‌డీ, కేటీవీ హెచ్ డీ, సన్ మ్యూజిక్, సన్ మ్యూజిక్, సన్ లైఫ్, సన్ లైఫ్ ఆర్‌ఐ, జెమినీ టీవీ, జెమినీ టీవీ హెచ్‌డీ, జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, జెమినీ న్యూస్, జెమినీ కామెడీ, కుషి టీవీ, జెమినీ యాక్షన్, జెమినీ లైఫ్, ఉదయ టీవీ, ఉదయు మూవీస్, ఉదయ మ్యూజిక్, ఉదయ న్యూస్, ఉదయ కామెడీ, చింటూ టీవీ, సూరియన్ టీవీ, సూర్య టీవీ, కిరణ్ టీవీ, సూర్య మ్యూజిక్, కొచ్చు టీవీ, సూర్య యాక్షన్.

అయితే కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సమీక్ష కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా వివిధ కారణాల వల్ల సుమారు 40 రేడియో ఛానల్స్‌కు హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను నిరాకరించింది.

Sun TV security clearance: MHA firm on decision

సెక్యూరిటీ క్లియరెన్స్‌ను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిరాకరించిందో అనే దానిపై సన్ నెట్‌వర్క్ అధికారి వెల్లడించారు. దీనికి కారణం గతంలో సన్‌ నెట్‌వర్క్‌పై పెండింగ్‌లో ఉన్న కేసులేనని తెలుస్తోంది. సన్ టీవిపై ఆఫీసుపై గతంలో మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ నిర్ణయంపై సన్ నెట్‌వర్క్ గ్రూపు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. గతంలో ఈ కేసుకు సంబంధించిన చెన్నైలోని కోర్టు కేంద్ర హోం శాఖ నిర్ణయంపై స్టే విధించిన సంగతి తెలిసిందే.

Read in English: Sun TV to go off air?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+